Mahindra 6 Seater Car: మహీంద్రా కంపెనీ త్వరలో సరికొత్త 6 సీటర్ కారు లాంచ్ చేయనుంది. ఎస్‌యూవీ విభాగంలో 5 సీటర్ల, 7 సీటర్ ఉండగా త్వరలో 6 సీటర్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికీ ఈ 6 సీటర్ కారు టెస్టింగ్ పూర్తయినట్టు సమాచారం.
దేశంలో టాటా మోటార్స్, మారుతి సుజుకి తరువాత అత్యధికంగా ఆదరణ పొందే ఇండియన్ కార్లలో మహీంద్రా కీలకమైంది. జీప్ వెర్షన్‌లో మహీంద్రా చాలా ప్రాచుర్యం పొందింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2021 ఆగస్టు నెలలో లాంచ్ అయిన ఈ కారు ఇప్పుడు ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారుగా నిలిచింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ను టాటా సఫారీ, ఎంజీ హెక్టార్‌తో పాటు టాటా హ్యారియర్, హ్యుండయ్ క్రెటాలతో పోటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విభాగంలో 5 సీటర్, 7సీటర్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఎస్‌యూవీ విభాగంలో సరికొత్తగా 6 సీటర్ అందుబాటులో తీసుకురానుంది. టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ఇప్పటికే 6 సీటర్ అందుబాటులో తీసుకువస్తున్నందున మహీంద్రా 6 సీటర్ పోటీ కాగలదు.
టాటా మోటార్స్ కంపెనీ సఫారీ, హ్యారియర్ ఫేస్‌లిప్ట్ వెర్షన్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లాంచ్ చేయనున్న 6 సీటర్ బయటి లుక్ ఒకేలా ఉండవచ్చు. అంటే ఎక్స్‌టీరియర్‌లో ఏ విధమైన మార్పు ఉండకపోవచ్చు. కేవలం ఇంటర్నల్ సిటింగ్ మాత్రమే మార్పు చేయనుంది మహీంద్రా కంపెనీ. ఇక ఫీచర్లు, ఇంజన్ ఇతర ప్రత్యేకతలను పరిశీలిద్దాం.
మహీంద్రా లాంచ్ చేయనున్న 6 సీటర్ మోడల్ ఇంజన్ , పవర్ ట్రెన్‌లో ఏ విధమైన మార్పు లేదు. పవర్ ట్రెన్ లో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 197 బీహెచ్‌పీ పవర్, 380 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇక 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 1543 బీహెచ్‌పి పవర్, 182 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో టాప్ ట్రిమ్ డీజిల్ వేరియంట్‌తో పాటు ఏడబ్ల్యూ సెటప్ కూడా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లో 6 సీటర్‌లో రెండవ వరుస కూర్చునే ప్రయాణికులకు 6 సీటర్ వేరియంట్‌కు చెందిన కొన్ని ఫీచర్లు అప్‌గ్రేడ్ కావల్సి ఉంది. మొత్తానికి కొన్ని ఇంటీరియల్, ఇంటర్నల్ సిట్టింగ్ మార్పులతో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లో 6 సీటర్ లాంచ్ కానుంది. ఎక్స్‌టీరియర్‌లో మార్పు ఉండకపోవడంతో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండవచ్చు.
Also read: Kia Carens: కియా క్యారెన్స్ దూకుడు మామాలుగా లేదుగా, ఎర్టిగాను దాటేసిన అమ్మకాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook