LIC IPO and Share Price: అతిపెద్ద జీవిత భీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో మార్చ్ 11 న మార్కెట్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఒక్కొక్క షేర్ ధర ఎంత ఉంటుందంటే..
ప్రస్తుతం మార్కెట్‌లో అంతా ఎల్ఐసీ ఐపీవో గురించే చర్చ నడుస్తోంది. దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ కావడం, ప్రపంచంలో మూడవ స్థానంలో ఉండటంతో ఎల్ఐసీ తీసుకొస్తున్న ఐపీవో చర్చనీయాంశమవుతోంది. ఎల్ఐసీ ఐపీవో ప్రవేశపెట్టిన రోజు షేర్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకునే అవకాశాలున్నాయి. మార్కెట్‌లోని పెట్టుబడిదారులు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి.
ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం ఎల్ఐసీ..ఐపీవో లాంచ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఎల్ఐసీ పాలసీదారుల రిజర్వేషన్ ఎలా ఉంటుంది, షరతులేంటనే విషయంపై ఇప్పటికే ఎల్ఐసీ ప్రకటనలిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ఐపీవో మార్చ్ 11న వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏకంగా 8 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఇష్యూతో ఎల్ఐసీ మార్చ్ 11వ తేదీన యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రానుందని తెలుస్తోంది. ఆ తరువాత రెండ్రోజులకు ఇతర ఇన్వెస్టర్లకు అందనుంది. దీనికి సంబంధించి మార్చ్ మొదటివారంలో సెబీ నుంచి అనుమతులు పొందనుంది. ఈ విషయంపై ఎల్ఐసీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయకపోయినా..మార్చ్ 11వ తేదీన లాంచ్ ఉండవచ్చని సమచారం.
అటు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కూడా ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీవో లాంచ్ తేదీ సమీపిస్తుండటంతో ఒక్కొక్క షేర్ ధర ఎంత ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. భీమా కంపెనీ షేర్ ఒక్కొక్కటి 2 వేల నుంచి 2 వేల 100 రూపాయల మధ్య ఉండవచ్చనేది బ్లూమ్‌బర్ల్ నివేదిక అంచనా. ఇప్పటికే ముసాయిదా పత్రాల్ని సెబీకు దాఖలు చేసే ప్రక్రియ పూర్తయింది. ఎల్ఐసీలో భారత ప్రభుత్వానికున్న వందశాతం వాటాలో 5 శాతం విక్రయించడం ద్వారా 8 బిలియన్ డాలర్లు సేకరించాలనేది లక్ష్యం.
పాలసీదారులంతా అప్లే చేయవచ్చా( Eligibility for applying LIC IPO)
దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. పాలసీదారులందరికీ ఐపీవోకు(LIC IPO) దరఖాస్తు చేసే పరిస్థితి లేదు. పాలసీతో పాన్ లింక్ అయినవారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ పాలసీ అప్లై చేసినవారికి పాలసీ డాక్యుమెంట్ ఇంకా రాకపోతే..రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా సందేహాలున్నాయి. డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేసిన తేదీలోగా పాలసీ తీసుకుంటేనే పాలసీ హోల్డర్ కోటా వర్తిస్తుంది. ఇక జాయింట్ పాలసీ హోల్డర్లు ఎల్ఐసీ ఐపీవోకు దరఖాస్తు చేయాలంటే..ఇద్దరిలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా వారి పాన్ నెంబర్ లింక్ అయుండాలి. అటు పాలసీదారుడికి డీమ్యాట్ అక్కౌంట్ ఉండాలి. బిడ్ లేదా ఐపీవో ప్రారంభమయ్యే తేదీ నాటికి, ఫిబ్రవరి 13, 2022 నాటికి ఎల్ఐసీలో ఒకటి లేదా ఎక్కువ పాలసీలున్న ఇండియన్స్ అర్హులు. పాలసీకు పాన్ వివరాల్ని ఫిబ్రవరి 28, 2022 నాటికి ఎల్ఐసీ వద్ద అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
Also read : Todays Gold Rate: భారీగా పెరిగిన బంగారం, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook