LIC IPO Opens: మార్కెట్‌లోకి రానున్న జంబో ఐపీఓ, మొత్తం వివరాలు ఇవే..!

LIC IPO Opens: భారతదేశంలో అతిపెద్ద  ఐపీఓ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు  లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)వెల్లడించింది. దీని సబ్‌స్క్రిప్షన్ మే 4న నుంచి ఆరంభమై మే 9న ముగియనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 11:27 AM IST
  • మార్కెట్‌లోకి రానున్న జంబో ఐపీఓ
  • LIC పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్
  • 5 శాతం వాటాలు అమ్మాలని కేంద్రం నిర్ణయం
LIC IPO Opens: మార్కెట్‌లోకి రానున్న జంబో ఐపీఓ, మొత్తం వివరాలు ఇవే..!

LIC IPO Opens: భారతదేశంలో అతిపెద్ద  ఐపీఓ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు  లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)వెల్లడించింది. దీని సబ్‌స్క్రిప్షన్ మే 4న నుంచి ఆరంభమై మే 9న ముగియనుంది. పాలసీహోల్డర్స్‌కు, ఎల్ఐసీ ఉద్యోగులు, రీటైల్ ఇన్వెస్టర్లు ఈ సబ్‌స్క్రిప్షన్‌తో ఐపీఓలో అధిక మొత్తంలో డిస్కౌంట్ పొందనున్నారు.  దీంతో LIC పాలసీదారులకు రూ.60, ఎల్ఐసీ సిబ్బందికి రూ.45 డిస్కౌంట్ పొందనున్నారు. ఈ భారీ డిస్కౌంట్‌తో LIC పాలసీ వినియోగదారులు రూ.842 నుంచి రూ.889 మధ్య, రీటైల్ ఇన్వెస్టర్లు, LIC సిబ్బంది రూ.857 నుంచి రూ.904 మధ్య ఎల్ఐసీ IPOకి అప్లై చేయొచ్చు. 

అయితే ఎల్ఐసీ IPOలో పాలసీ వినియోగదారులకు 10 శాతం కోటా ప్రత్యేకంగా కేటాయించడం అత్యంత విశేషం.ఈ ఐపీఓలో మొత్తం 22,13,74,920  షేర్లు విక్రయించగా.. LIC వినియోగదారులకు 2,21,37,492 షేర్లు, సిబ్బందికి 15,81,249 షేర్లు కేటాయించారు. కోటా వివరించిన వివరాల ప్రకారం.. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌(Qualified Institutional Buyers‌)కు 50 శాతం, రీటైల్ షేర్ హోల్డర్లకు 35 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(Non-Institutional Investors)కు 15 శాతం షేర్లు కేటాయించారు. LIC  IPOలోని ఒక లాట్‌కు చెందిన 15 షేర్లకు అప్లై చేయొచ్చని తెలిపింది. ఇందులో రీటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్లు కంటే ఎక్కువ అప్లై చెయ్యరాదు. ఒక లాట్‌కు రీటైల్ ఇన్వెస్టర్లు(Retail Investors) రూ.13,530 నుంచి రూ.14,235 మధ్య, పాలసీవినియోగదారులు రూ.12,630 నుంచి రూ.13,335 మధ్య, ఎల్ఐసీ సిబ్బంది రూ.12,855 నుంచి రూ.13,560 మధ్య బిడ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. 

ఇక IPL IPO సైజ్ విషయానికి వస్తే... కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటాలు విక్రయించడంతో రూ.19,517 కోట్ల నుంచి రూ.20,557 కోట్ల వరకు నిధుల్ని సమకూర్చనుంది. రష్యా-ఉక్రెయిన్ కారణంగా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీంతో కేంద్రం LIC IPO సైజ్‌ను తగ్గించాయి. అయితే దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం 5 శాతం వాటాలు అమ్మాలని నిర్ణయించింది. అయితే మార్చిలోనే ఎల్ఐసీ ఐపీఓ రావాల్సి ఉండగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వాయిదా పడింది. IPO సంబంధించిన పూర్తి ప్రక్రియ  మే 12 ముగుస్తుండడంతో మే 4వ తేది అందుబాటులోకి వచ్చేలా షెడ్యూల్ నిర్ణయించారు.

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్... రూ.65 వేల ఐఫోన్ 12పై భారీ తగ్గింపు...

Also Read: Illicit Affair: ప్రాణాల మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం... అతని మర్మాంగాలు కోసేసిన యువతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News