LIC IPO: ఎల్​ఐసీ ఐపీఓ వచ్చే నెల 13 నుంచే? షేరు ధర ఎంతంటే..!

LIC IPO: ఎల్​ఐసీ ఐపీఓ గురించి కొత్త అప్​డేట్​ వచ్చింది. వచ్చే నెల తొలి వారంలోనే ఐపీఓకు అనుమతులు లభించనున్నట్లు సమాచారం. ఐపీఓ తేదీలపై అంచనాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 06:03 PM IST
  • వెచ్చే నెలలో ఎల్​ఐసీ ఐపీఓ
  • అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించనున్న ఎల్​ఐసీ
  • 5 శాతం విక్రయానికి గత వారమే డ్రాఫ్ట్ దాఖలు
LIC IPO: ఎల్​ఐసీ ఐపీఓ వచ్చే నెల 13 నుంచే? షేరు ధర ఎంతంటే..!

LIC IPO: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్​ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్​) వచ్చే నెలలో ఐపీఓకు రానుంది. అయితే ఐపీఓ తేదీలపై ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. వచ్చే నెల 11 నుంచి యాంకర్ ఇన్వెస్టర్లకోసం ఐపీఓ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్​ విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసినట్లు తాజాగా వెల్లడించింది.

యాంకర్​ ఇన్వెస్టర్లకు అందాబాటులోకి వచ్చిన రెండు రోజుల తర్వాత అంటే మార్చి 13 నుంచి ఐపీఓ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది రాయిటర్స్​.

మార్చి మొదటి వారంలో నియంత్రణ సంస్థల నుంచి ఎల్​ఐసీ ఐపీఓకు అన్ని అనుమతులు లభిస్తాయని అంచనా వస్తున్నాయి. అ తర్వాతి వారంలో బ్యాండ్ ధర నిర్ణయించే వీలుందని తెలుస్తోంది.

అయితే ఐపీఓ తేదీ సహా బ్యాండ్​ ధర నిర్ణయంపై వస్తున్న వార్తల గురించి ఎల్​ఐసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

బ్లూమ్​బర్గ్ ప్రకారం.. ఎల్​ఐసీ షేరు ధర ఐపీఓలో రూ.2,000 నుంచి రూ.2,100 వద్ద ఉండొచ్చని తెలిపింది. అయితే ప్రభుత్వంతో చర్చలు, మదపరుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకని మార్పులు చేయొచ్చని వెల్లడించింది.

గత వారమే డ్రాఫ్ట్​ దాఖలు..

5 శాతం వాటను విక్రయించేందుకు గత నెలలోనే సెక్యూరిటీస్​ ఎక్స్ఛేంజి బోర్డ్​ ఆఫ్ ఇండియా (సెబీ)కి దరఖాస్తు పంపింది ఎల్​ఐసీ. ఈ ఐపీఓ ద్వారా 8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.60 వేల కోట్లు) సమీకరించనున్నట్లు తెలిపింది.

కీలక విషయాలు..

దేశంలో అతిపెద్ద ఐపీఓగా ఎల్​ఐసీ నిలవనుంది.

ఐపీఓ ప్రక్రియ పూర్తయి ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన తర్వాత.. దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా ఎల్​ఐసీ అవతరించనుంది.

Also read: EPF Balance: యూఏఎన్​ నంబర్ లేకుండా ఈపీఎఫ్ బ్యాలెన్స్​ తెలుసుకోవడం ఎలా?

Also read: iPhone 12: ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​- పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News