JioPhone Next Offer: జియో బంపర్ ఆఫర్! రూ.5వేల లోపే 4G స్మార్ట్‌ఫోన్!

Jio Offer: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది రిలయన్స్. జియో 4G స్మార్ట్‌ఫోన్ JioPhone Nextను ఇప్పుడు చాలా చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ విషయాలు తెలుసుకుందాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 11:55 AM IST
JioPhone Next Offer: జియో బంపర్ ఆఫర్! రూ.5వేల లోపే 4G స్మార్ట్‌ఫోన్!

Jio Offer: రిలయన్స్ తన చౌకైన 4G స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం విడుదల చేసింది. ఇది ఎక్కువ ధర కారణంగా వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందుకే కస్టమర్లను ఆకట్టుకోవాలని అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది జియో. ఇప్పుడు ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా JioPhone Nextను కేవలం రూ. 4,499కే పొందవచ్చు. దీనికి పరిమిత కాల వ్యవధిని నిర్ణయించారు. మీరు 4G స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు లేదా ఏదైనా ఇతర ఫంక్షనల్ స్మార్ట్‌ఫోన్ల అయినా ఎక్సేంజ్ చేసుకోవచ్చు. పాత ఫోన్‌ని మార్చుకోవడం ద్వారా, మీరు కేవలం రూ.4,499కే JioPhone నెక్స్ట్‌ని పొందగలుగుతారు. 

మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు వెళ్లనట్లయితే.. ఆ ఫోన్ ను రూ. 6,499 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు రూ. 501 ప్రాసెసింగ్ ఫీజుతో సహా మొత్తం రూ. 2,500 అడ్వాన్స్‌గా చెల్లించి.. ఫైనాన్స్ ద్వారా తీసుకోవచ్చు. ప్లాన్ రకాన్ని బట్టి వినియోగదారుడు బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలి.

Specifications
జియో ఫోన్ నెక్ట్స్ (JioPhone Next) అనేది సరసమైన 4G స్మార్ట్‌ఫోన్. ఇది 5.45-అంగుళాల మల్టీటచ్ HD+ (720×1440 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ 4G స్మార్ట్‌ఫోన్. ఇది 3500mAh బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 13MP సెన్సార్‌తో వెనుకవైపు ఒకే కెమెరా మరియు ముందు భాగంలో 8MP సెన్సార్ ఉంది. 

RAM And Storage 
JioPhone Next యొక్క ప్రధాన ఆకర్షణ దాని OS. దీని పేరు ప్రగతి OS మరియు ఇది భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో అభివృద్ధి చేయబడింది. ఇందులో Qualcomm Snapdragon 215 SoC ప్రోసెసర్ వినియోగించారు. ఇది 2GB RAMతో పనిచేస్తుంది. ఇంటర్నెల్ స్టోరేజ్ 32GB ఇచ్చారు. కస్టమర్లు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 512GB వరకు విస్తరించుకోవడానికి అనుమతిస్తుంది. 

Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్... రూ.15వేలు విలువ చేసే ఈ ఎల్‌ఈడీ టీవీ కేవలం రూ.999కే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News