డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం- అప్లోడ్​లో వొడాఫోన్ ఐడియా జోరు!

Reliance Jio: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అక్టోబర్​కు సంబంధించి.. 4జీ నెట్​వర్క్ డౌన్​లోడ్, అప్లోడ్ స్పీడ్​ గణాంకాలను విడుదల చేసింది. డౌన్​లోడ్ పరంగా జియో మరోసారి అగ్రస్థానాన్ని సాధించినట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 11:08 AM IST
  • 4జీ నెట్​వర్క్ డౌన్​లోడ్ స్పీడ్​లో జియో అగ్రస్థానం
  • అప్​లోడ్​లో వొడాఫోన్ ఐడియా నంబర్ 1
  • ట్రాయ్ అక్టోబర్ నివేదికలో వెల్లడి
డౌన్​లోడ్​ స్పీడ్​లో జియో అగ్రస్థానం- అప్లోడ్​లో వొడాఫోన్ ఐడియా జోరు!

Reliance Jio top in highest average data download speed: డౌన్​లోడ్  పరంగా అత్యంత వేగవంతమైన 4జీ డేటాను అందించే టెలికాం కంపెనీగా మరోసారి రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలకు గానూ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్​) వెల్లడించిన (TRAI report on 4G Data speed) గణాంకాల ప్రకారం ఈ విషయం వెల్లడైంది.

అక్టోబర్​లో జియో సగటున 21.9 ఎంబీపీఎస్ వేగంతో (Jio 4G download speed) ఇంటర్నెట్ అందించినట్లు ట్రాయ్​ పేర్కొంది. ఈ ఏడాది జూన్ తర్వాత మళ్లీ  అక్టోబర్​లోనే డేటా స్పీడ్​ 21.9 స్థాయికి చేరినట్లు వెల్లడించింది ట్రాయ్​.

ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియా (వి)లు కూడా డేటా స్పీడ్​ను క్రమంగా పెంచుతూ వస్తుండటంతో.. జియోతో పోటీ పెరుగుతున్నట్లు వివరించింది ట్రాయ్​.

Also read: OnePlus Nord 2 Pac-Man smartphone: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర

అక్టోబర్​లో ఎయిర్​టెల్​ 4జీ మొబైల్ నెట్​వర్క్ డౌన్​లోడ్ స్పీడ్ 13.2 ఎంబీపీఎస్​గా (Airtel 4G download speed) తెలిపింది టెలికాం నియంత్రణ సంస్థ. జూన్​లో ఇది 5 ఎంబీపీఎస్​గా ఉన్నట్లు వివరించింది. 

ఇక వొడాఫోన్ ఐడియా 4జీ మొబైల్ నెట్ డౌన్​లోడ్ స్పీడ్ అక్టోబర్​లో​ 15.6 ఎంబీపీఎస్​గా నమోదైనట్లు (Vodafone Idea 4G download speed) తెలిపింది ట్రాయ్​. జూన్​లో ఇది 6.5 ఎంబీపీఎస్​గా ఉన్నట్లు వివరించింది.

Also read: వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా ఏ నగరంలో ఎంత ధర

Also read: యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?

అప్​లోడ్​లో వొడాఫోన్ ఐడియాదే అగ్రస్థానం..

అప్లోడ్ పరంగా అత్యంత వేగవంతమైన 4జీ డేటాను అందించే టెలికాం సంస్థగా వొడాఫోన్ ఐడియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అక్టోబర్​లో వొడాఫోన్ ఐడియా సగటున 7.6 ఎంబీపీఎస్ అప్​లోడ్ (Vodafone Idea 4G Upload speed) స్పీడ్​తో ఇంటర్నెట్ అందించినట్లు ట్రాయ్​ పేర్కొంది.

ఇతర టెలికాం సంస్థలైన రిలయన్స్​ జియో, ఎయిర్​టెల్​ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ట్రాయ్​ ప్రకారం అక్టోబర్​లో ఎయిర్​టెల్ 4జీ అప్లోడ్ స్పీడ్​ 5.2 ఎంబీపీఎస్​గా (Airtel 4G Upload speed) నమోదైంది. రిలయన్స్ జియో 4జీ డేటా అప్లోడ్ స్పీడ్​ 6.4 శాతంగా (Jio 4G Upload speed) నమోదైంది.

మైస్పీడ్ అప్లికేషన్ సహయంతో.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సేకరించిన ఫలితాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ట్రాయ్​ పేర్కొంది.

Alao read: రాకేశ్ ఝున్​ఝున్​వాలా బడ్జెట్ ఎయిర్​లైన్​ 'ఆకాశ' రెండు భారీ డీల్స్​!

Also read: 2021-22 క్యూ4లో ఎల్​ఐసీ ఐపీఓ- వివిధ పీఎస్​యూల ప్రైవేటీకరణ కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News