New plans: దేశంలోని టెలికాం దిగ్గజాలన్నీ కనీసం 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్రీ పెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటి వరకు మంథ్లీ ప్లాన్ అంటే 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్.. గతంలో టెలికాం సంస్థలన్నీ నెల మొత్తం కవర్ అయ్యేలా కనీసం ఒక ప్రీ పెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉండాలని సూచించిన నేపథ్యంలో.. దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ.. కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.
జియో నెల రోజుల ప్లాన్..
అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్‌ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. రూ.296తో ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే.. రోజుకు అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు సహా 25 జీబీ 4జీ డేటా లభిస్తుంది.
ఎయిర్టెల్ ఆఫర్ ఇలా..
ఎయిర్టెల్ కూడా రిలయన్స్ మాదిరిగానే రూ.296తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 25 జీబీ 4జీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు (రోజుకు) పొందొచ్చు.
ఇక రూ.319తో కూడిన మరో ప్లాన్‌ను కూడా అందుబాటులో ఉంచింది ఎయిర్టెల్. దీని ద్వారా ప్రతి రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్‌ను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.
వొడాఫోన్ ఐడియా 31 రోజుల ప్లాన్..
వొడాఫోన్ ఐడియా కాస్త భారీ ధరతో 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.327తో రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతోపాటు.. 25 జీబీ డేటాను ఇస్తోంది.
దీనితో పాటు రూ.337తో 31 రోజుల వ్యాలిడిటీ ఇస్తూ మరో ప్లాన్‌ను అందిస్తోంది వొడాఫోన్ ఐడియా. దీని ద్వారా రోజుకు 2జీబీ 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్లతో పాటు.. అపరిమిత కాల్స్‌ను ఆస్వాదించొచ్చని కంపెనీ చెబుతోంది.
Also read: LIC IPO Update: మే మొదటి వారంలోనే ఎల్ఐసీ ఐపీఓ.. పూర్తి అప్డేట్స్ ఇవే
Also read: Petrol price: సామాన్యులపై పెట్రో పిడుగు.. 2014తో పోలిస్తే ధరలు ఎంత పెరిగాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook