Twitter Blue subscriber సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌తో ఆదాయం పెంచుకుంటున్న ట్వీట్టర్

Edited by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 11:18 AM IST
  • ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న మస్క్
  • బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా సంపాదించే యోచన
  • యూజర్లను పెంచుకునే పనిలో పడ్డ మస్క్
 Twitter Blue subscriber సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌తో ఆదాయం పెంచుకుంటున్న ట్వీట్టర్

 Twitter Blue subscriber ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతీ రోజు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. రోజు ఏదో ఒక వార్తతో ఆయన హల్ చల్ చేస్తున్నారు. అయితే ఈసారి ఆయన తన యూజర్లకు గట్టి షాక్‌ ఇవ్వనున్నారనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చేలా మరో రిపోర్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

టెస్లా కారులో షేర్లు అమ్మి మరీ ట్వీట్టర్‌లో ఎలన్ మస్క్ పెట్టుబడి పెట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 44బిలియన్‌ డాలర్లు పెట్టి ట్విటర్‌ను కొనుక్కున్నారు. అంతర్జాతీయ సమాజంలో ఫ్రీడం ఆఫ్ స్పీచ్‌గా పేరు తెచ్చుకున్న ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌ ... ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాప్‌ ద్వారా తాను పెట్టిన డబ్బులను వసూలు చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు టైమ్స్‌ రిపోర్ట్‌ తన నివేదికలో పేర్కొంది.  ముఖ్యంగా ట్విటర్‌కు బాగా ఎడిక్ట్ అయిన బ్లూ టిక్‌ వెరిఫైడ్‌ అకౌంట్‌ యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను వసూలు చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారని సమాచారం. ఇలా 2028 నాటికి వెయ్యికోట్లు ఆర్జించాలని మస్క్ భావిస్తున్నారని టైమ్స్ రిపోర్ట్ ప్రచురించింది. 

దీంతో పాటుగా ట్విట్టర్ ద్వారా సంపాదించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను మస్క్ అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిపుణులు తనకు ఇచ్చిన నివేదికను పలువురు పెట్టుబడిదారులకు మస్క్ వివరించారని తెలుస్తోంది. 2025 నాటికి ట్విట్టర్‌ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా 69 మిలియన్లను ఆర్జించేందుకు ప్రణాళికలు వేస్తున్నారని సమాచారం. ఇలా ఆదాయాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవడంతో పాటు 2028 నాటికి 128 మిలియన్ల మంది యూజర్లను కూడా పోగు చేసే పనిలో పడ్డారు ఎలన్ మస్క్. 

కిందటి ఏడాది ట్విటర్‌ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌పై నెలవారి సబ్‌స్క్రిప్షన్‌ కింద రూ.269 వసూలు చేసింది. ఇలా బ్లూ టిక్ సబ్‌స్క‍్రిప్షన్‌ తీసుకున్న యూజర్లకు ట్వీట్‌లను అన్‌డూ చేయడంతో పాటు ట్వీట్‌లను సేకరించి ఫోల్డర్‌ను క్రియేట్‌ చేసే వెసులుబాటు కల్పించింది. ట్విటర్ ఐకాన్‌ కలర్స్‌ మార్చే ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా డబ్బులు సబ్‌స్క్రిప్షన్ కింది వసూలు చేసిన యూజర్ల సంఖ్య పెరుగుతుందే కాని తగ్గదని తన వద్ద ఉన్న రిపోర్టును పెట్టుబడిదారులకు చూపించారని సమాచారం. ఇలా తాను అమలులోకి తీసుకురానున్న సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ పై సవివరంగా వివరించారని సమాచారం. ఇలా పలు మార్గాల్లో ఆదాయాన్ని అన్వేషించడంతో పాటు పెట్టుబడిదారులను ఆకర్శించే పనిలో ఎలన్‌ మస్క్ పడ్డారని టైమ్స్ రిపోర్ట్ సవివరమైన వార్తా కథనంతో ప్రచురించింది.

also read    banks raise FD rates వడ్డీ రేటు పెంచనున్న రెండు ప్రభుత్వ, మూడు ప్రయివేట్ బ్యాంకులు

also read    MTNL Recharge Plan: 49 రూపాయల రీఛార్జ్ తో 180 రోజుల వ్యాలిడిటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News