Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎన్ని సీట్లు కావాలంటే అన్ని మీకే!

Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 19, 2024, 09:12 PM IST
Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎన్ని సీట్లు కావాలంటే అన్ని మీకే!

Railway General Coach: అతి తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం లభిస్తుందని ప్రజలు రైల్వే ప్రయాణానికి ఇష్టపడుతుంటారు. కానీ సీట్ల కొరత.. రిజర్వేషన్‌కు భారీగా వెయిటింగ్‌ ఉండడంతో చాలా మంది రైల్వే ప్రయాణానికి దూరమవుతున్నారు. అలాంటి వారి కోసం రైల్వే శాఖ భారీ శుభవార్త వినిపించింది. ఇక ఎన్ని కావాలంటే అన్ని సీట్లు ప్రయాణికులకు లభించనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

Also Read: Post Office Scheme: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు పొందే సూపర్ హిట్ స్కీమ్

దేశవ్యాప్తంగా 370 రైళ్లకు వెయ్యి అదనపు జనరల్ కోచ్‌లను ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. నవంబర్ చివరి నాటికి అదనపు జనరల్‌ కోచ్‌లను జత చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. మూడు నెలల్లో 600 సాధారణ కోచ్‌లను అనుసంధానం చేయడం ద్వారా రోజూ సుమారు లక్ష మంది అదనపు ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణించనున్నారు. రాబోయే రెండేళ్లలో నాన్-ఏసీ కేటగిరీకి చెందిన 10 వేలకు పైగా  అదనపు జనరల్ కోచ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రచిస్తోంది. సాధారణ తరగతి ప్రయాణికుల  సౌకర్యాల విస్తరణకు  రైల్వే ప్రాధాన్యమిస్తుండడం విశేషం.

Also Read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

 

రైలు ప్రయాణంపై సామాన్య ప్రజల నుంచి డిమాండ్‌ విపరీతంగా పెరుగుతుండడంతో ఆ మేరకు భారతీయ రైల్వే శాఖ సౌకర్యాల కల్పించేందుకు చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో వివిధ రైళ్లలో జనరల్ కేటగిరీ (జీఎస్)కి చెందిన 600 కొత్త అదనపు కోచ్‌లను జోడించింది. ఈ కోచ్‌లన్నీ సాధారణ రైళ్లకు జోడించబడడంతో ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. నవంబర్ 2024 చివరి నాటికి దాదాపు 370 సాధారణ రైళ్లకు జనరల్ కేటగిరీకి చెందిన వెయ్యికి పైగా కోచ్‌లు జోడించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.

కొత్త జనరల్ కేటగిరీ కోచ్‌లను అమర్చడం ద్వారా రోజుకు సుమారు లక్ష మంది అదనపు  ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారని రైల్వే శాఖ భావిస్తోంది. వచ్చే రెండేళ్లలో రైల్వేలో పెద్ద సంఖ్యలో నాన్-ఏసీ క్లాస్ కోచ్‌లను చేర్చే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాలపై రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ)  దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. తమ అత్యంత ప్రాధాన్యాంశాల్లో సాధారణ తరగతి ప్రయాణికుల అంశం ఒకటి అని.. ఈ వర్గానికి చెందిన ప్రయాణికులకు ఉన్నత సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వచ్చే రెండేళ్లలో నాన్ ‌ఏసీ జనరల్‌ క్లాస్‌ కోచ్‌లు అదనంగా 10వేలకు పైగా రైల్వేలో చేరనున్నాయని.. వాటిలో 6 వేలకు పైగా జీఎస్ కోచ్‌లు కాగా.. మిగిలిన కోచ్‌లు స్లీపర్ క్లాస్‌కు చెందినవి అని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ వివరించారు. ఇవి పూర్తయితే రోజూ దాదాపు 8 లక్షల మంది జనరల్‌ క్లాస్‌ ప్రయాణికులు అదనంగా ప్రయాణించగలుగుతారని పేర్కొన్నారు. జనరల్‌ బోగీల సంఖ్య పెంచుతుండడంతో అప్పటికప్పుడు ప్రయాణానికి సిద్ధమైన ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News