Indian Currency Falls: రూపాయి మరింత పతనం.. మరో 19 పైసలు డౌన్!

Indian rupee slipped 19 paise to 82.38 against the US dollar. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రోజురోజుకు బలహీనపడుతోంది. 3 రోజుల క్రితం ౩౩ పైసలు క్షీణించిన రూపాయి.. నేడు 19 పైసలు పతనం అయింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 17, 2022, 06:15 PM IST
  • రూపాయి మరింత పతనం
  • మరో 19 పైసలు డౌన్
  • ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
Indian Currency Falls: రూపాయి మరింత పతనం.. మరో 19 పైసలు డౌన్!

Indian rupee falls 19 paise against US Dollar: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కొన్నిరోజులుగా ఇండియన్ కరెన్సీ రూపాయి భారీగా బలహీనపడుతోంది. గత శుక్రవారం ౩౩ పైసలు క్షీణించిన రూపాయి.. సోమవారం 19 పైసలు పతనం అయింది. దాంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.38గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి పతనం భారత ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. 

యూఎస్ బాండ్లలో ప్రతిఫలాలు పెరగడం కూడా రూపాయి విలువ పడిపోవడానికి కర్ణం అని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రూపాయి పతనం అనేది వాణిజ్య లోటుకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంత కాలం రూపాయి పతనం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన డాలర్ నిల్వలను ఖర్చు చేస్తూ.. రూపాయి పతనం కాకుండా జోక్యం చేసుకుంటున్నా ఫలితం మాత్రం లేదు.

అటు రూపాయి పతనంపై ప్రతిపక్షాలు కేంద్రంలోని మోదీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రూపాయి పతనాన్ని సమర్ధించుకుంటున్నారు. రూపాయి పతనానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణమని, ఇందులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేమీ లేదని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే రూపాయి పతనానికి కారణంగా నిర్మలమ్మ అభిప్రాయపడ్డారు. వాణిజ్య లోటు ప్రతి చోట పెరుగుతోందని, దీనిపై తాము దృష్టి సారించి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

ఈ ఏడాదిలో రూపాయి విలువ దాదాపు 10.7 శాతం క్షీణించింది. పెరుగుతున్న చమురు ధరలు, యూఎస్ ఫెడరల్ రేటు పెంపు ప్రచారం కారణంగా రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోతుందని రాయిటర్స్ వివరించింది. రూపాయి పతనం ఇండియాలోని సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో చదువులు ప్రియం అవుతున్నాయి. మనం దిగుమతి చేసుకునే పెట్రోల్, డీజిల్ భారం అవుతున్నాయి. డాలర్ బలపడటం విదేశీయులకు కలిసొస్తుందనే చెప్పాలి. మన కరెన్సీతో పోలిస్తే అమెరికాలో పనిచేసే ఉద్యోగులకు డాలర్ రూపంలో అత్యధిక డబ్బు సమకూరుతుండటంతో ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బాప్‌రే ఇంతపెద్ద 'అనకొండ'నా.. వీడియో చూస్తే ఆమ్మో అనకుండా ఉండలేరు!

Also Read: 250 కిలోల బరువు ఉన్న సింహానికి క్లాస్ పీకిన వ్యక్తి.. దాడి చేసిన తగ్గేదేలే! నువ్ తోపులకే తోపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News