Income Tax Return New website: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం, కొత్త ఫీచర్లు ఇవే

ITR New website Launch: పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యాన్ని తొలగించేందుకు, కొత్తగా ఆప్షన్లు చేర్చి ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లో భారీగా మార్పులు చేశారు. ఈ ఫైలింగ్ 2.0 అంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా కొత్త వెబ్‌సైట్ (incometax.gov.in) లాంచింగ్ గురించి ట్వీట్ చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 7, 2021, 10:00 AM IST
Income Tax Return New website: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం, కొత్త ఫీచర్లు ఇవే

ITR New website Launch: ఆదాయపు పన్ను శాఖ ఇ-టాక్స్ ఫైలింగ్ సైట్‌లో మార్పులు చేసింది.  ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ ఇ-టాక్స్ ఫైలింగ్ వెబ్ పోర్టల్ జూన్ 1 నుండి జూన్ 6 వరకు ఏ సేవలు అందించదు. ఐటీ శాఖ కొత్త వెబ్‌సైట్ http://www.incometax.gov.in నేటి (జూన్ 7) నుండి తిరిగి ప్రారంభం అవుతుంది. కొన్ని కొత్త ఫీచర్లు దీనిలో చేర్చింది.

పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యాన్ని తొలగించేందుకు, కొత్తగా ఆప్షన్లు చేర్చి ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లో భారీగా మార్పులు చేశారు. ఈ ఫైలింగ్ 2.0 అంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా కొత్త వెబ్‌సైట్ లాంచింగ్ గురించి ట్వీట్ చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax Returns) న్యూ వెబ్‌సైట్‌లో మీకు లభిస్తున్న 6 ఫీచర్లు ఇక్కడ అందిస్తున్నాం.

Also Read: Gold Price Today In Hyderabad 07 June 2021: నేడు మిశ్రమంగా బంగారం ధర, నిలకడగా వెండి ధరలు

1. పన్ను చెల్లింపుదారులకు రీఫండ్స్ త్వరగా తిరిగి చెల్లించడానికి ఆదాయపు పన్ను దాఖలు (Income Tax Returns) వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. ఇది పన్ను చెల్లింపుదారులకు ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌గా సేవలు అందించనుంది.

2. పన్ను చెల్లింపుదారులకు అప్‌లోడ్ చేసిన ఫైల్స్ లేదా పెండింగ్‌లో పనులను సైతం కేవలం ఒకే డాష్‌బోర్డులో మీకు చూపిస్తుంది. దీనిద్వారా మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు.

3. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ 1, 4 (ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్) మరియు ఐటీఆర్ 2 (ఆఫ్‌లైన్) చేయడానికి పన్ను చెల్లింపుదారుల (Income Tax Rules)కు ఇంటరాక్టివ్ ప్రశ్నలతో ఐటీఆర్ విధానం సాఫ్ట్‌వేర్ ఉచితంగా లభిస్తుంది. ఐటీఆర్ 3, 5, 6, 7 తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు.

4. పన్ను చెల్లింపుదారులు తమ వేతనం, ఇంటి ఆస్తి, వ్యాపారం / ప్రొఫెషన్ సహా ఆదాయానికి సంబంధించిన కొన్ని వివరాలను నమోదు చేయడానికి ముందుగానే వారి ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకునే వీలు కల్పించింది. TDS మరియు SFT స్టేట్‌మెంట్‌లు అప్‌లోడ్ చేసిన తర్వాత ఉద్యోగి వేతనం, వడ్డీ, డివిడెండ్ మరియు మూలధన లాభాలతో పూర్తి వివరాలు కనిపిస్తాయి. దీనికి ఇటీవల తుది గడువును జూన్ 30, 2021 వరకు పొడిగించారు.

Also Read: LPG Gas Paytm Offer: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, Freeగా LPG Cylinder

5. పన్ను చెల్లింపుదారుల (Income Tax Payers) ప్రశ్నలకు వేగంగా స్పందన, సమాధానాల కోసం ట్యాక్స్ పేయర్లకు సహాయం చేయడానికిగానూ కొత్త కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ట్యాక్స్ పేయర్స్ ప్రశ్నలు, వినియోగదారు మాన్యువల్స్, వీడియోలు మరియు చాట్‌బాట్ / లైవ్ ఏజెంట్ కొత్త వెబ్‌సైట్ ద్వారా అందిస్తోంది.

6. ఆదాయపు పన్ను ఫారాలు దాఖలు చేయడం, పన్ను నిపుణులను (Income Tax Professionals) చేర్చుకోవడం, ఏవైనా నోటీసులు జారీ అయితే వాటి స్పందనలను ఫేస్‌లెస్ పరిశీలనలో లేదా అప్పీళ్లలో సమర్పించడానికి అవకాశం ఇచ్చారు.

పన్ను చెల్లింపుదారుల అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి 18 జూన్ 2021న కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని ప్రారంభించనున్నట్లు Income Tax India స్పష్టం చేసింది.

Also Read: EPF Interest Amount: 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, వడ్డీ నగదుపై కీలక నిర్ణయం

పన్ను చెల్లింపుదారుల కోసం త్వరలోనే మొబైల్ యాప్ ప్రారంభించనున్నారు. అప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేసుకునే వీలుంటుంది. అయితే కొన్ని మార్పులు చేసి కొత్త వెబ్‌సైట్ ప్రారంభించేందుకు గత వారం రోజులుగా టాక్స్ పేయర్స్‌కు అసౌకర్యం కలిగించాల్సి వచ్చిందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News