Income Tax Details: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు తేదీ నిన్న అంటే జూలై 31తో ముగిసింది. దేశవ్యాప్తంగా 6.6 కోట్లమంది రిటర్న్స్ దాఖలు చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ వివరించింది. అదే సమయంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఎంత ట్యాక్స్ చెల్లించాయో వివరాలు బహిర్గతమయ్యాయి.
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ గుడువు తేదీ ముగియడంతో ట్యాక్స్ ఎవరు ఎంత చెల్లించారనే గణాంకాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా దేశంలోని ప్రముఖ కంపెనీల ట్యాక్స్ వివరాలు బయటికొచ్చాయి. దేశంలో పెద్ద కంపెనీలుగా ఉన్న రిలయన్స్, టాటా, జిందాల్, ఐటీసీ, ఇండియన్ ఆయిల్, ఎల్ఐసీ వంటి కంపెనీల ట్యాక్స్ వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. ఆసియాలోనే టాప్ కంపెనీగా ఉన్న రిలయన్స్ చెల్లించిన ట్యాక్స్ ఆ కంపెనీ ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువ. అందరికంటే తక్కువని చెప్పవచ్చు. అంటే ఈ కంపెనీకు ట్యాక్స్ మినహాయింపులు ఎక్కువగా వర్తించినట్టు అర్ధం చేసుకోవచ్చు. అత్యధికంగా చెల్లించింది టాటా కంపెనీనే. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..
దేశంలోని టాప్ కంపెనీల్లో టాటా గ్రూప్ నుంచి రెండు కంపెనీల పేర్లు ప్రస్తావించాల్సి వస్తుంది. అందులో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కాగా రెండవది టాటా స్టీల్. ఆర్ధిక సంవత్సరం 2022లో టీసీఎస్ ఒక్కటే 11,536 కోట్లు చెల్లించింది. టీసీఎస్ ఆదాయంలో ఇది 6.8 శాతం. మరోవైపు టాటా స్టీల్ టర్నోవర్‌లో 11,079 కోట్లు చెల్లించింది. అంటే ఇది టాటా స్టీల్ ఆదాయంలో 8.4 శాతంగా ఉంది. రెండూ కలిపితే 15.2 శాతం ట్యాక్స్ రూపంలో టాటా గ్రూప్ చెల్లించినట్టు అవుతుంది.
ఇక రెండవది జిందాల్ గ్రూప్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ . ఈ కంపెనీ 2022-23 ఆర్దిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి 8,013 కోట్ల పన్ను చెల్లించింది. కంపెనీ మొత్తం ఆదాయంలో 6.6 శాతంగా ఉంది. దేశంలోని అతిపెద్ద భీమా కంపెనీ ఎల్ఐసీ ఈ ఆర్ధిక సంవత్సరానికి 7,902 కోట్ల ఆదాయం చెల్లించింది. ఎల్ఐసీ ఆదాయంలో 2.9 శాతంగా ఉంది.
ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సైతం ఈ ఆర్ధిక సంవత్సరానికి 7,549 కోట్ల ట్యాక్స్ చెల్లించింది. దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ ఈ ఆర్ధిక సంవత్సరానికి 7,260 కోట్ల ట్యాక్స్ చెల్లించింది. కంపెనీ ఆదాయంలో ఇది 6.7 శాతంగా ఉంది. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవల్సిన కంపెనీ మరొకటుంది. అది ఐటీసీ. ఈ ఆార్ధిక సంవత్సరం అంటే 2022-23లో తన ఆాదాయంలో 7.6 శాతం 4,771 కోట్లను పన్నుగా చెల్లించింది.
ఇక ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకు చెందిన రిలయన్స్ గురించి చెప్పుకోవాలి. ఈ కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరానికి చెల్లించిన పన్ను 7,702 కోట్లు. కంపెనీ ఆదాయంలో ఇది కేవలం 1.65 శాతం మాత్రమే. అంటే మిగిలిన కంపెనీలతో పోల్చినా, ఆదాయంతో పోల్చినా చాలా తక్కువ శాతం ట్యాక్స్ రిలయన్స్‌దే కావడం గమనార్హం.
Also read: Mahindra Sales: మహీంద్రా ఎస్‌యూవీలకు పెరిగిన క్రేజ్, జూలైలో అత్యదిక విక్రయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook