Share Market Investment Tips: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి సింపుల్ టిప్స్

Share Market Investment Tips: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా ? మీకు షేర్ మార్కెట్ గురించి ఏబీసీడీలు తెలుసా ? ఏ రంగంలోనైనా నైపుణ్యం, మెళకువలు తెలియకపోతే అందులో కాలు పెట్టాకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఓనమాలు తెలియకుండా కాలుపెడితే.. విలువైన సమయం మాత్రమే కాదు... కష్టపడి సంపాదించిన డబ్బు కూడా గంగపాలవుతుంది.

Written by - Pavan | Last Updated : Nov 21, 2023, 03:01 PM IST
Share Market Investment Tips: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి సింపుల్ టిప్స్

Share Market Investment Tips: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా ? మీకు షేర్ మార్కెట్ గురించి ఏబీసీడీలు తెలుసా ? ఏ రంగంలోనైనా నైపుణ్యం, మెళకువలు తెలియకపోతే అందులో కాలు పెట్టాకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే ఏ రంగంలోనైనా నైపుణ్యం లేకుండా బరిలోకి దిగితే కేవలం వారి విలువైన సమయం మాత్రమే వృథా అవుతుంది కానీ స్టాక్ మార్కెట్లో ఓనమాలు తెలియకుండా కాలుపెడితే.. విలువైన సమయం మాత్రమే కాదు... కష్టపడి సంపాదించిన డబ్బు కూడా గంగపాలవుతుంది. గత మూడునాలుగేళ్ల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. స్టాక్ మార్కెట్ గురించి జనంలో అవగాహన పెరుగుతుండటమే అందుకు కారణం. అయితే, స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు, ఎలా స్పందించాలి అనే విషయం తెలియక తమ డబ్బును నష్టపోతుంటారు. అలా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన వారి కోసమే ఈ చిట్కాలు..

స్టాక్ మార్కెట్ గురించి : 
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికంటే ముందుగా స్టాక్ మార్కెట్ గురించి, అందులో ఉండే ఒడిదుడుకుల గురించి తెలుసుకోవాలి. కేవలం మీ వద్ద ఉన్న డబ్బును తీసుకెళ్లి కిరాణంలో సరుకు కొన్నట్టు కాకుండా స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా అధ్యయనం చేసి తెలుసుకున్న తరువాత బరిలోకి దిగాలి. అలాంటప్పుడే మీ డబ్బు నష్టపోకుండా ఉంటుంది.

ఆధరణ ఉన్న రంగాలు : 
స్టాక్ మార్కెట్లో ఆధరణ ఉన్న రంగాలు ఎంపిక చేసుకుని ఆ సెక్టార్‌లోనే పెట్టుబడి పెడితే వాటికి దీర్ఘకాలంలో భారీ లాభాలు ఉంటాయి. ఒక్కోసారి మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించనిరీతిలో భారీ లాభాలు లభిస్తాయి. 

ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ : 
స్టాక్ మార్కెట్లో ప్రవేశించడం రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ఎప్పటికప్పుడు ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్ బుక్ చేసుకుని లాభాలు ఆర్జించడం లేదంటే దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ మొత్తంలో లాభాలు పొందడం. ఈ రెండింటిలో మీరు ఏం చేయదల్చుకున్నారు లేదా రెండూ చేయదల్చుకున్నారా అనే అంశంపై స్పష్టత ఉండాలి. సరైన అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి.   

ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు : 
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి. ఆవేశంతోనో లేక అనాలోచితంగానో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

డెరివేటివ్స్ : 
ఈక్వీటీతో పోల్చుకుంటే ఫ్యూచర్, ఆప్షన్స్, ఫార్వార్డ్ వంటి డెరివేటివ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఎంతో రిస్క్‌తో కూడుకున్న అంశంగా అనుభవం ఉన్న ఇన్వెస్టర్స్ చెబుతుంటారు. అందుకే డేరివేటివ్స్ తీసుకునే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలి.

పెట్టుబడి లక్ష్యాలు : 
ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక పెట్టుబడి లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధేశించుకోవాలి. నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా పెట్టుబడి ప్రణాళికలు రచించుకోవాలి. 

షేర్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ : 
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేక రకాలుగా ఉంటాయి. అందులో షేర్స్ కొనుగోలు చేస్తూ ఈక్వీటీలో పెట్టుబడి పెట్టడం ఒక రకమైతే.. విడతల వారీగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ రూపంలో లేదా ఒకేసారి పెద్దమొత్తంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మరో రకం. ఈ రెండింటి మధ్య తేడాలు, ఈ రెండింటి వల్ల కలిగే లాభ, నష్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

పేరున్న కంపెనీల స్టాక్స్ : 
పేరున్న కంపెనీల స్టాక్స్ కొనడం ద్వారా కచ్చితమైన లాభాలు ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఊరూపేరు లేని కంపెనీల్లో పెట్టుబడి పెడితే.. అవి లాభాల బాట పట్టడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి సాధారణ కంపెనీలు దీర్ఘకాలంలో భారీ లాభాలు సంపాదించవచ్చు లేదంటే నష్టపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే పేరున్న కంపెనీల్లో పెట్టుబడులు సురక్షితంగా కాగా సాధారణ కంపెనీల్లో పెట్టుబడులు కొంత రిస్కుతో కూడుకున్నవి అవుతాయి.

పోర్ట్‌ఫోలియో నిర్మాణం : 
మీరు ఎంపిక చేసుకునే స్టాక్స్ కూడా లాభాల బాటలో ప్రయాణించే వివిధ రంగాలకు చెందిన వివిధ కంపెనీలవి అయ్యుండాలి. అలాంటప్పుడే ఒకవేళ దురదృష్టవశాత్తుగా ఏదైనా ఒక కంపెనీ స్టాక్ వల్ల నష్టం వాటిల్లినా.. మరో కంపెనీ స్టాక్ ఆదుకుంటుంది. అలాగే ఒక రంగం స్టాక్స్ కొంపముంచినా.. ఇంకొ రంగానికి చెందిన స్టాక్స్ ఆ నష్టాల నుండి గట్టెక్కించే అవకాశం ఉంటుంది.   

అనలైజ్ యువర్‌సెల్ఫ్ : 
మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, మార్కెట్ ట్రెండ్‌ని అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు అనలైజ్ చేయకుండా గుడ్డిగా పెట్టుబడి పెడుతూ పోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి : Stocks For Best Returns: 4 నుండి 5 వారాల్లో అధిక లాభాల కోసం 5 స్టాక్స్

ఇది కూడా చదవండి : 5 Stocks For 48% High Returns: ఏడాదిలోనే మీ పెట్టుబడికి 48% వరకు లాభాలు ఇచ్చే స్టాక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News