Health Insurance New Guidelines: హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ IRDAI ఇటీవల నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ రూల్స్‌తోపాటు బీమా క్లెయిమ్ నిబంధనలు మారనున్నాయి. ప్రస్తుతం బీమా క్లెయిమ్ కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి ఉండగా.. ఇక నుంచి మూడేళ్లకు తగ్గనుంది. IRDAI కొత్త మార్పుల తరువాత బీమా కంపెనీలు వివిధ పాలసీల ప్రీమియంలో మార్పులు చేసేందుకు పరిశీలిస్తున్నాయి. ప్రీమియం చెల్లింపు గురించి HDFC ERGO ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించింది. కంపెనీ ప్రీమియంను యావరేజ్‌గా 7.5 శాతం నుంచి 12.5 శాతం పెంచాల్సి ఉంటుందని పేర్కొంది. మిగిలిన బీమా కంపెనీలు కూడా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి. మంచి ప్లాన్ కావాలనుకునేవారు ప్రీమియం రేట్లు కాస్త ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని మెయిల్‌లో తెలిపాయి.
ఇన్సూరెన్స్ స్కీమ్ పనితీరును సమీక్షించడంతోపాటు చికిత్సలకు అవుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రీమియం ధరలను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. కస్టమర్ వయస్సు, నగరం ఆధారంగా ప్రీమియం ధరల్లో మార్పులు ఉంటాయి. HDFC ERGO ప్రీమియం పెంపు కాస్త ఎక్కువగా ఉంటుంది. IRDAIకి సమాచారం అందించి ప్రీమియం ధరల్లో మార్పులు చేస్తుంది. రేట్లలో ఈ మార్పు రెన్యూవల్ ప్రీమియంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రెన్యూవల్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. కస్టమర్లకు సమాచారం అందజేస్తుంది.
ACKO జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వైస్ చైర్మన్ రూపిందర్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. IRDAI కొత్త రూల్స్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి వయోపరిమితి లేదనే నియమం కూడా ఉందని తెలిపారు. గతంలో ఈ పరిమితి 65 ఏళ్లుగా ఉండేదని చెప్పారు. అయితే వయసు పెరిగే కొద్దీ వ్యాధుల ముప్పు పెరుగుతుందని.. అందుకే వయసును బట్టి ప్రీమియం మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చని వెల్లడించారు. ప్రతి ఐదేళ్లకు వయస్సు సంబంధిత స్లాబ్ మారితే.. ప్రీమియం సగటున 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుతుందన్నారు. బీమా కంపెనీలు తమ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రీమియం ధరల్లో మార్పులు చేస్తాయన్నారు.
ప్రస్తుతం మన దేశంలో వైద్య ద్రవ్యోల్బణం దాదాపు 15 శాతం ఉండడం కూడా ప్రీమియంలను పెంచడానికి మరొక కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డేటా ప్రకారం.. దేశంలో ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తులు చెల్లించే సగటు మొత్తం గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగిందని అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు ఆరేళ్లలో సగటు మొత్తం 48 శాతం పెరిగి రూ.26,533కి చేరుకుంది. కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా గురించి ప్రజల్లో అవగాహన పెరగడంతో ఎక్కువ మంది పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
Also Read: IPL 2024 Playoff Scenario: మారిపోయిన ఐపీఎల్ ప్లే ఆఫ్ లెక్కలు.. టాప్-4లో నిలిచే జట్లు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter