Gold Price Today : నేటి బంగారం ధరల వివరాలు.. ఏయే నగరాల్లో ఎంత ధర అంటే..

Gold Price Today feb 11 2022 : బంగారమంటే ఇప్పుడు చాలామందికి పెట్టుబడి ఆప్షన్. అందుకే బంగారం ధరలు తగ్గాయంటే చాలు కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 08:22 AM IST
  • దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.49,690
  • విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.49,970
Gold Price Today : నేటి బంగారం ధరల వివరాలు.. ఏయే నగరాల్లో ఎంత ధర అంటే..

Gold Price Today Feb 11 2022 : నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.250 మేర పెరిగింది. గడిచిన 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49 వేల మార్క్‌కి కాస్త అటు, ఇటుగా నమోదవుతోంది. అయితే  జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లోని ధరల్లో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయనే విషయం గమనించాలి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 

హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉంది. నిన్నటితో పోలిస్తే కేవలం రూ.250 మేర ధర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,690గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.280 మేర ధర పెరిగింది.

విజయవాడలోనూ ఇంచుమించుగా హైదరాబాద్ మార్కెట్‌లోని ధరలే కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200గా ఉంది. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,700గా ఉంది.

 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది.

కేరళలో (Kerala) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,970గా ఉంది.

Also Read: Horoscope Today Feb 11 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అదృష్టం తలుపు తట్టే ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News