GoAir Summer Sale From March 22: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. అదే సమయంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ సంస్థ గోఎయిర్(GoAir) సమ్మర్ సేల్ తీసుకొచ్చింది.
నేటి నుంచి మార్చి 26 వరకు సమ్మర్ సేల్ బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉండనుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో బుక్ చేసుకున్న ఫైట్ టికెట్స్‌పై మార్చి 22 నుంచి జూన్ 30వ తేదీ వరకు అదనపు సౌకర్యాలతో ప్రయాణం చేయవచ్చునని GoAir పేర్కొంది. కస్టమర్స్ సౌకర్యార్థం సమ్మర్ సేల్ ద్వారా వచ్చామని నేటి నుంచి కస్టమర్లు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
Also Read: CA Final Result 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ 2021 ఫలితాలు విడుదల
- నిర్ణీత లగేజీ పరిమితికి మించి మరో 5 కేజీల లగేజీని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అనుమతిస్తున్నట్లు గోఎయిర్(GoAir) తెలిపింది. ఈ సీజన్‌లో అధికంగా లగేజీలతో ప్రయాణించే వారికి ఇది ప్లస్ పాయింట్ కానుందని ఓ ప్రకటనలో ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
- గోఎయిర్ ప్రయాణికులు బుక్ చేసుకున్న తమ టికెట్‌ల జర్నీ డేట్స్‌ను మార్చుకునే అవకాశాన్ని సైతం కల్పించడం గమనార్హం. దీనిపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. వేసవిలో ఏ అసౌకర్యం కలగకుండా తమ ప్రయాణికులకు సమ్మర్ ట్రావెల్ ఎంజాయ్‌మెంట్ అందించేందుకు గోఎయిర్ ఈ ఆఫర్ ప్రకటించింది.
Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 22, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం
కన్వినియన్స్ ఫీజులు(Convenience Fee) తొలగింపు
సమ్మర్ సేల్‌లో భాగంగా మార్చి 22 నుంచి మార్చి 26 తేదీల మధ్య జూన్ 30 వరకు ప్రయాణించేలా చేసుకునే విమాన టికెట్ల బుకింగ్‌పై కన్వినియన్స్ ఫీజు మాఫీ చేయడం విశేషం. అయితే GoAir ఎయిర్‌లైన్స్ డైరెక్ట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు ఈ సదుపాయాన్ని కల్పించినట్లు ప్రకటించింది.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook