Forbes List 2023: ఫోర్బ్స్ కొత్త జాబితా విడుదల, ప్రపంచ టాప్ కంపెనీల్లో 45వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్

Forbes List 2023: ప్రపంచంలో అత్యంత ఉన్నత పరిశ్రమల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన గ్లోబల్ 2000 జాబితాలో ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 8 స్థానాలు పైకి ఎగబాకింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 13, 2023, 06:14 PM IST
Forbes List 2023: ఫోర్బ్స్ కొత్త జాబితా విడుదల, ప్రపంచ టాప్ కంపెనీల్లో 45వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్

Forbes List 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి ప్రపంచంలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో గతంతో పోలిస్తే పైకి ఎగబాకింది. ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకుని 45 వస్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ మేగజీన్ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ 2000 జాబితా ఇది.

ఫోర్బ్స్ మేగజీన్ ప్రతియేటా అత్యంత ధనవంతులు, టాప్ ఇండస్ట్రీస్, అత్యంత శక్తివంతమైన వ్యక్తులు, అత్యంత శక్తివంతమైన మహిళలు ఇలా విభిన్న కేటగరీల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఫోర్బ్స్ మేగజీన్ గ్లోబల్ 2000 జాబితా విడుదల చేసింది. అంటే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న పరిశ్రమల జాబితా ఇది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్లోబల్ 2000 జాబితాలో 45వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి గత ఏడాదితో పోలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ యేడాది ఏకంగా 8 స్థానాలు పైకి ఎగబాకింది. ఈ జాబితాలో అత్యున్నత స్థానంలో ఉన్న భారతీయ కంపెనీ కూడా ఇదే. 

ఫోర్బ్స్ 2023 సంవత్సరానికి ప్రపంచంలోని టాప్ 2000 కంపెనీల జాబితా విడుదల చేసింది. ఈ జాబితా సిద్ధం చేసేముందు విక్రయాలు, లాభాలు, సంపద, మార్కెట్ మూల్యాంకనం ఇలా నాలుగు అంశాల్ని పరిగణలో తీసుకున్నామని ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాకు చెందిన అతి పెద్ద బ్యాంక్ జేపీ మోర్గాన్ 2011 తరువాత తొలిసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. బ్యాంకు మొత్తం సంపద 3709 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక వారెన్ బఫేకు చెందిన బర్క్‌షేర్ హాత్‌వే గత ఏడాది జాబితాలో అన్నింటికంటే అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది పెట్టుబడుల్లో నష్టాల వల్ల 338వ స్థానానికి పడిపోయింది. సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ కంపెనీ అరామ్ కో రెండవ స్థానంలో ఉంది. ఇక ఆల్ఫాబెట్ 7 వ స్థానంలో ఉంటే ఆపిల్ 10 వస్థానంలో ఉంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని టాప్ 2000 పరిశ్రమల్లో అంటే ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో 45వ స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 109.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విక్రయాలు, 8.3 బిలియన్ అమెరికన్ డాలర్ల లాభంతో 45వ స్థానానికి చేరుకుంది. రిలయన్స్ గ్రూప్ వ్యాపారం ఆయిల్ నుంచి టెలీకం వరకూ విస్తరించి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ జాబితాలో జర్మనీకు చెందిన బీఎండబ్ల్యూ గ్రూప్, స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే, చైనాకు చెందిన అలిబాబా గ్రూప్, అమెరికాకు చెందిన ప్రోక్టర్ అండ్ గేంబుల్, జపాన్‌కు చెందిన సోనీ కంటే ముందు ఉంది.

ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో 55 ఇండియన్ కంపెనీలున్నాయి. ప్రపంచ బిలియనీర్ గౌతమ్ అదానీకు చెందిన మూడు కంపెనీలు అదానీ ఎంటర్ ప్రైజస్ 1062వ స్థానంలో, అదానీ పవర్ 1488వ స్థానంలో, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 1598వ స్థానంలో ఉన్నాయి.

ఇక ఎస్బీఐ 2002లో 105వ స్థానంలో ఉంటే ఇప్పుడు 77వ స్థానంలో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2022లో 153వ స్థానంలో ఉంటే ఇప్పుడు 128వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐసీఐసీఐ బ్యాంకు 2022లో 204వ స్థానంలో ఉంటే ఇప్పుడు 163వ స్థానంలో ఉంది. ఇక ఓఎన్జీసీ 226 వ స్థానంలో, ఎల్ఐసీ 363వ స్థానంలో, టీసీఎస్ 387వ స్థానం, యాక్సిస్ బ్యాంకు 423వ స్థానంలో, ఎన్టీపీసీ 433వ స్థానంలో, ఎల్ అండ్ టీ 449వ స్థానంలో, భారతీ ఎయిర్‌టెల్ 478వ స్థానంలో నిలిచాయి. కోటక్ మహీంద్ర బ్యాంకు 502వ స్థానంలో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 540వ స్థానంలో, ఇన్ఫోసిస్ 554వ స్థానంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా 586వ స్థానంలో నిలిచాయి. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాదితో పోలిస్త 8 స్థానాలు మెరుగుపర్చుకుని 45 వ స్థానానికి చేరుకోవడం విశేషం.

Also read: Income tax Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ మార్పులు గమనించకపోతే సమస్యలే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News