EPFO: గుడ్​ న్యూస్​- 21.38 కోట్ల ఖాతాల్లో వడ్డీ జమ చేసిన ఈపీఎఫ్​ఓ!

EPFO: పీఎఫ్​ చందాదారులకు శుభవార్త చెప్పింది ఈపీఎఫ్​ఓ. 21.38 కోట్ల ఖాతాల్లో వడ్డీని జమ చేసినట్లు సోమవారం ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 07:34 PM IST
  • గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్​ఓ
  • పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ
  • 8.50 శాతం వడ్డీని చెల్లించినట్లు వెల్లడి
EPFO: గుడ్​ న్యూస్​- 21.38  కోట్ల ఖాతాల్లో వడ్డీ జమ చేసిన ఈపీఎఫ్​ఓ!

EPFO has credited an interest rate of 8.50 per cent 21.38 crore account holders for FY 2020-21: చివరి ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి వడ్డీ పీఎఫ్​ చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసినట్లు ఈపీఎఫ్​ఓ (EPFO interest) సోమవారం అధికారికంగా ప్రకటించిది. మొత్తం 21.38 కోట్ల ఖాతాల్లో 8.50 శాతం చొప్పున వడ్డీని జమ చేసినట్లు తెలిపింది. ఈపీఎఫ్​ఓ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ చందాదారులకు 8.5 శాతం వడ్డీ (EPFO interest rate for FY21) చెల్లించాలని ధర్మకర్తల బోర్డు ఈ ఏడాది మార్చిలో నిర్ణయించింది. ఇటీవలే ఇందుకు కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. దీనితో తాజాగా లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది ఈపీఎఫ్​ఓ.

ఈపీఎఫ్​ఓ గురించి..

ప్రపంచవ్యాప్తంగా సామాజిక భద్రత కల్పించే అతిపెద్ద సంస్థల్లో ఈపీఎఫ్​ఓ కూడా ఒకటి. ఖాతాదారుల సంఖ్య, లావాదేవీల సంఖ్య పరంగా కూడా అతిపెద్ద సంస్థగా ఉంది.

పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా..

పీఎఫ్​ బ్యాలెన్స్​ను నాలుగు విధాలుగా చెక్​ చేసుకోవచ్చు.

1. EPFOHO UAN అని టైప్​ చేసి 7738299899 నంబర్​కు.. రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ నుంచి ఎస్​ఎంఎస్​ పంపడం ద్వారా (EPF SMS service) కూడా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

2. ఈపీఎఫ్ఓ టోల్ ఫ్రీ నంబర్ '011-22901406' కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా (EPF missed call service) ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను పొందొచ్చు. అయితే ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుంది.

3.ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్​లోకి లాగిన్ అవడం ద్వారా. పాస్​బుక్​ను యాక్సెస్ చేయొచ్చు. ఇందులో ప్రతి నెల ఎంత మొత్తం పీఎఫ్ జమ అవుతుంది. ఉద్యోగి వాటా ఎంత? కంపెనీ వాటా ఎంత? సహా ఇప్పటి వరకు జమ అయిన వడ్డీ వంటి వివరాలను కూడా తెలుకునే అవకాశముంది.

4. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ పాస్​బుక్​ను యాక్సెస్ చేయొచ్చు (EPF balance with UMANG app). అయితే ముందుగా ఉమాంగ్​లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Also read: Bitcoin: బిట్​కాయిన్​ను గుర్తించే ప్రతిపాదనేది మా వద్ద లేదు: నిర్మలా సీతారామన్​

Also read: November 30 Deadline: నవంబర్ ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News