BattRE Storie electric scooter launched in India: జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బ్యాట్రీ.. భారత దేశంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరును బ్యాట్రీ స్టోరీగా నామకరణం చేసింది. సామాన్యునికి అందుబాటులో ఉండే అతి తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఎక్కువ దూరం వెళ్లేందుకు వీలుగా బ్యాట్రీ సంస్థ ఈ స్కూటర్‌ను రూపొందించింది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 132 కిలో మీటర్లు ప్రయాణించొచ్చు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీలకు బ్యాట్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీని ఇస్తుంది.
బ్యాట్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కంపెనీ ఎక్స్ షోరూంలో రూ.89,600గా నిర్ణయించింది. ఇక ఇతర రాష్ట్రాలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో ఈ స్కూటర్ తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటల్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఎకో, కంఫర్ట్, స్పోర్ట్, రివర్స్, పార్కింగ్ లాటి రైడింగ్ విధానాలలో ఇది అందుబాటులో ఉంది.ఈ బ్యాట్రీ స్టోరీ స్కూటర్ గంటకు 65 కి.మీల స్పీడ్‌తో ప్రయాణించగలదు. పెద్ద ఫుట్‌బోర్డ్ మరియు అతిపెద్ద ఇన్-క్లాస్ సీటు కూడా అందుబాటులో ఉంది.
ఈ స్కూటర్ ఏఐఎస్ 156 ఆమోదించిన 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రూపొందింది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్‌తో ఇంటిగ్రేటెడ్ స్పాడ్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్ తయారు చేయబడింది. ఇక స్కూటర్ రన్నింగ్ సమయంలో మొబైల్‌కి ఏదైనా కాల్ వస్తే.. స్పెషల్ అలర్ట్ ఫీచర్ కూడా ఉంది. సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లను సెర్చ్ చేసే కనెక్టెడ్ డ్రైవ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 132 కిలో మీటర్లు ప్రయాణించొచ్చు. లక్ష కిలోమీటర్ల వరకు ఈ వెహికిల్‌ను టెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలలో విపరీతంగా మంటలు చెలరేగుతుండటంతో.. లక్ష కిలో మీటర్ల వరకు ముందుగానే టెస్ట్ చేసి, మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ స్కూటర్ సేఫ్టీపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేసింది. సురక్షితమైనదిగా, మరింత విశ్వసనీయంగా నమ్మొచని కంపెనీ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.