GPS Toll System: త్వరలో జీపీఎస్ టోల్ విధానం, ఎలా పనిచేస్తుంది, ఎప్పట్నించి

GPS Toll System: దేశంలో హైవేపై ప్రయాణించాలంటే నిర్ణీత టోల్ రుసుము కట్టాల్సిందే. దీనికోసం ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమల్లో ఉంది. త్వరలో ఈ విధానం మారనుంది. కొత్తగా జీపీఎస్ టోల్ విధానం అమల్లో రానుంది. ఈ కొత్త విధానం ఎలా ఉంటుంది, ఎప్పట్నించి అమల్లోకి రానుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 24, 2024, 01:00 PM IST
GPS Toll System: త్వరలో జీపీఎస్ టోల్ విధానం, ఎలా పనిచేస్తుంది, ఎప్పట్నించి

GPS Toll System: హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే ఛార్జి వసూలు. తక్కువ దూరం ప్రయాణిస్తే తక్కువే చెల్లించే విధానం ప్రస్తుతం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న జీపీఎస్ ఆధారిత టోల్ విధానంలో ఇది సాధ్యమే. కొత్త విధానం అమల్లోకి వస్తే ఎంత దూరం ప్రయాణిస్తే అంతే చెల్లించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానం ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో దేశంలోని 5-10 ఎంపిక చేసిన హైవేల్లో జీపీఎస్ ఆధారిత టోల్ విధానాన్ని ప్రయోగాత్నకంగా పరిశీలించనుంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఫాస్ట్‌ట్యాగ్ విధానం ఇక కనుమరుగైపోతుంది. దేశవ్యాప్తంగా కొత్త విధానం అమలు చేయడానికి ముందు ప్రయోగాత్మకంగా కొన్ని హైవేల్లో అమలు చేయనున్నారు. 

జీపీఎస్ టోల్ విధానం ఎలా పనిచేస్తుంది

ఎన్‌హెచ్‌ఏఐ ప్రస్తుతం శాటిలైట్ ఆధారిత జీపీఎస్ టోల్ విధానంపై పనిచేస్తోంది. ఈ కొత్త విధానంపై ప్రస్తుతం కొన్ని సందేహాలున్నాయి. ఈ కొత్త విధానంలో టోల్ ప్లాజా దాటగానే టోల్ కట్ అవుతుంది. దీనికోసం వాహనంలో ఓ డివైస్ ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ డివైస్ ఆధారంగా వాహనం కదలిక ట్రాక్ చేయబడుతుంది. హైవే ఎగ్జిట్ పాయింట్‌కు చేరుకోగానే ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ కట్ అవుతుంది. 

ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్

హైవేలపై ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్ కట్ అయ్యే విధానం ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇప్పుడున్న విధానం ప్రకారం హైవేపై తక్కువ దూరం ప్రయాణించినా సరే..టోల్ ప్లాజా దాటితే చాలు మొత్తం రుసుము కట్టాల్సి వస్తోంది. కొత్త విధానం సెన్సార్ ఆధారంగా పనిచేస్తుంది. టోల్ చెల్లించేందుకు వాహనం ఆగాల్సిన అవసరం లేదు. అయితే జీపీఎస్ టోల్ విధానంలో పాసెంజర్ తన వాహనం, తన పేరు రెండూ రిజిస్టర్ చేసుకుని బ్యాంక్ ఎక్కౌంట్‌తో అనుసంధానం కావల్సి ఉంటుంది. 

కేంద్ర రోడ్డు రవాణా శాఖ హైవే ఫీజు నిబంధనల్లో మార్పులు చేసింది. దీని ప్రకారం హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే రుసుము చెల్లించవచ్చు. అయితే జీపీఎస్ ఆధారిత టోల్ విధానం అమలు చేసేముందు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా అంశాల్ని పరిగణలో తీసుకోవాలి. కొత్త విధానంలో యూజర్ అంటే ప్రయాణీకుడి ప్రైవసీ అనేది కీలకంగా మారుతుంది. ఎందుకంటే జీపీఎస్ టోల్ విధానంలో ఆ ప్రయాణీకుడి వ్యక్తి గత డేటా ట్రాక్ అవుతుంది. 

Also read: Ayodhya Trains: అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా, దేశంలోని వివిధ రాష్ట్రాల్నించి అయోధ్యకు రైళ్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News