Best Selling Cars: స్విఫ్ట్, వేగన్‌ఆర్ కాదిప్పుడు బలేనో అగ్రస్థానం, 6.56 లక్షలకే మీ సొంతం

Best Selling Cars: ఇండియన్ కార్ మార్కెట్‌లో మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగుతోంది. అత్యధికంగా విక్రయమయ్యే కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. జాబితాలో టాప్ 4 కార్లు మారుతి సుజుకి కంపెనీవే ఉన్నాయంటే ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చెసుకోవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2023, 02:25 PM IST
Best Selling Cars: స్విఫ్ట్, వేగన్‌ఆర్ కాదిప్పుడు బలేనో అగ్రస్థానం, 6.56 లక్షలకే మీ సొంతం

Best Selling Cars: మారుతి సుజుకి ఇప్పటికీ ఇండియాలో టాప్ సేల్ కారు ఇదే. మోడల్ ఏదైనా అత్యధికంగా విక్రయమౌతూ ప్రత్యర్ధి కంపెనీలకు గుబులు పుట్టిస్తుంటుంది. తాజాగా ఫిబ్రవరి 2023లో అత్యధికంగా విక్రయమైన టాప్ 4 కార్లు మారుతి సుజుకి కంపెనీవే. అన్ని హ్యాచ్‌బ్యాక్ కార్లే. 

అయితే మారుతి సుజుకి కంపెనీకు చెందిన ఆల్టో లేదా వేగన్‌ఆర్, స్విఫ్ట్ మోడల్స్ అత్యధికంగా విక్రయమయ్యాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే మొదటి స్థానంలో ఇవి లేవు. టాప్ 4లో నిలిచిన కార్లన్నీ మారుతి సుజుకి కంపెనీకు చెందిన కార్లే కావడం విశేషం. ప్రతి నెలా విడుదల చేసినట్టే ఫిబ్రవరి 2023 అత్యధిక విక్రయ కార్ల జాబితాలో మారుతి సుజుకి బలేనో మొదటి స్థానంలో ఉంది. 

మారుతి బలేనో

ఫిబ్రవరి 2023లో మారుతి సుజుకి బలేనో 18,592 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఫిబ్రవరి 2022లో విక్రయమైన 12, 570 యూనిట్లతో పోలిస్తే 47.91 శాతం ఎక్కువ. మారుతి బలేనో ధర 6.56 లక్షల నుంచి 9.83 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్‌తో పాటు సీఎన్జీ ఆప్షన్ కూడా లభ్యమౌతోంది.

మారుతి స్విఫ్ట్

ఫిబ్రవరి 2023లో రెండవ స్థానంలో నిలిచింది మారుతి స్విఫ్ట్. అయితే స్విఫ్ట్ అమ్మకాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 2023లో 18,412 యూనిట్లు విక్రయం కాగా గత ఏడాది ఇదే సమయానికి 19,202 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంటే 4.11 శాతం తగ్గింది.

మారుతి ఆల్టో

ఫిబ్రవరి 2023లో మూడవ స్థానంలో నిలిచింది మారుతి సుజుకి ఆల్టో. ఈ కారు 18,114 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఫిబ్రవరి 2022లో 11, 551 యూనిట్లు విక్రయాలయ్యాయి. ఈ విక్రయాల్లో 56.82 శాతం పెరుగుదల నమోదైంది.

మారుతి వేగన్‌ఆర్

ఫిబ్రవరి 2023లో మారుతి సుజుకి వేగన్‌ఆర్ నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ కారు 16, 889 యూనిట్ల అమ్మకాలు సాధించింది. అటు గత ఏడాది అంటే 2022 ఫిబ్రవరిలో 14,669 యూనిట్ల విక్రయాలయ్యాయి. అంటే 15.13 శాతం వృద్ధి నమోదైంది. 

Also read: Airtel Free Offers: అపరిమిత 5జీ సేవలతో ఉచిత ఓటీటీ అందించే ఎయిర్‌టెల్ ప్లాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News