/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Defects in Country Best Selling Car Maruti Suzuki Baleno: మారుతి సుజుకి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ ఆసియాలో కారులను రూపొందించే సంస్థలలో ఇదే అతి పెద్దది. అమ్మకాల్లో మారుతి సుజుకి సంస్థ ఈ ఏడాది దూసుకుపోయింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసిన బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ బాగా అమ్ముడవుతోంది. నవంబర్ 2022 నెలలో మారుతి సుజుకి బాలెనో అత్యధికంగా అమ్ముడైన కారు. అయితే బాలెనోలో కొన్ని లోపాలు ఉన్నాయి. మీరు కొత్త బాలెనోను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఈ విషయాలను ఓసారి చెక్ చేసుకోండి. 

డీజిల్ ఇంజన్‌:
మార్కెట్లో మారుతి సుజుకి బాలెనోతో పోటీ పడుతున్న హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లు డీజిల్ ఇంజన్‌లలో అందుబాటులో ఉన్నాయి. బాలెనోలో మాత్రం డీజిల్ ఇంజన్‌ ఎంపిక లేదు. బాలెనో కేవలం 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది కాకుండా ప్రీమియం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేకపోవడం కూడా మైనస్.

ప్రీమియం ఫీచర్లు:
మారుతి సుజుకి కొత్త బాలెనో కారు ఫీచర్-లోడెడ్ హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ.. వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మిడిల్ సీట్ హెడ్‌రెస్ట్, సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వైర్‌లెస్ ఫంక్షన్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ మొదలైన కొన్ని ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండవు. 

సీట్ కుషనింగ్:
పాత మోడల్ మాదిరిగానే.. కొత్త బాలెనోలో సీట్ కుషనింగ్ చాలా మృదువుగా అనిపిస్తుంది. దీని కారణంగా దూర ప్రయాణాల సమయంలో ఇది కొంత అసౌకర్యంగా ఉంటుంది. అయితే పొడవైన వారికి లెగ్ స్పేస్ మరియు హెడ్‌రూమ్ బాగుంటుంది. 

బూట్ స్పేస్:
మునుపటి మోడల్‌తో పోలిస్తే.. బూట్ ఏరియా 21 మీటర్లు తగ్గింది. బూట్ లిప్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది భారీ బ్యాక్‌ప్యాక్‌లను లోడ్ చేయడం మరియు అన్‌లోడ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది.

Also Read: ఈ బైక్ 'మైలేజ్'కా బాప్.. ఫుల్ ట్యాంక్ నింపితే 900 కిలోమీటర్లు పక్కా! కావాలంటే చెక్ చేసుకోండి  

Also Read: Rythu Bandhu 2022: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Section: 
English Title: 
Best Selling Car 2022: Defects in Country Best Selling Car Maruti Suzuki Baleno, Check these things before you buying
News Source: 
Home Title: 

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారులో లోపాలు.. కొనడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
 

Best Selling Car: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారులో లోపాలు.. కొనడానికి ముందు ఈ విషయాలు చెక్ చేసుకోండి!
Caption: 
Source: Twitter
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారులో లోపాలు

కొనడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి

డీజిల్ ఇంజన్‌ ఎంపిక లేదు

Mobile Title: 
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారులో లోపాలు.. కొనడానికిముందు ఈ విషయాలు తెలుసుకోండి
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Wednesday, December 28, 2022 - 11:59
Request Count: 
63
Is Breaking News: 
No