Free Airport Lounge Access: క్రెడిట్ కార్డులు అందించే ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కొత్త మార్పులు, చేర్పులు

Free Airport Lounge Access: క్రెడిట్ కార్డు జారీ విషయంలో బ్యాంకులు పోటీ పడుతుంటాయి. బ్యాంకులకు అత్యంత లాభదాయకమైన వ్యాపారమది. అందుకే కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2024, 03:20 PM IST
Free Airport Lounge Access: క్రెడిట్ కార్డులు అందించే ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కొత్త మార్పులు, చేర్పులు

Free Airport Lounge Access: క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తుంటాయి. యాన్యువల్ ఫీ ఉచితం చేయడం, కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌తో పాటు విమానాస్రయాల్లో లాంజ్ యాక్సిస్ ఉచితం చేయడం వంటివి ఉంటాయి. క్రెడిట్ కార్డులు అందించే ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యాల్లో ఇప్పుడు కొత్తగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఎంపిక చేసిన కస్టమర్లు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు కాంప్లిమెంటరీగా ఇచ్చే ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యం ఆఫర్లు రివైజ్ అవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ ఇచ్చే రెగాలియా క్రెడిట్ కార్డ్‌లో తాజాగా మార్పులు వచ్చాయి. ఇవి డిసెంబర్ 1 నుంచి అమల్లో ఉన్నాయి. ఈ మార్పుల ప్రకారం క్రెడిట్ కార్డు హోల్డర్లకు కొన్ని అర్హతలుండాలి. బ్యాంకులు ఇచ్చే ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యం రెండు రకాలుగా ఉంటుంది. భాగస్వామ్య కార్డ్ నెట్‌వర్క్స్, యాగ్రిగేటర్ కంపెనీలుగా ఉంటాయి. ఈ భాగస్వామ్యం కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనాలు అందించేందుకు అనుమతిస్తుంది. 

కస్టమర్లు ఫ్రీ లాంచ్ సౌకర్యం పొందిన ప్రతిసారీ బ్యాంకులు అందుకు తగిన రుసుము ఎయిర్‌పోర్ట్ అధారికీకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది లాంజ్ లొకేషన్, బ్యాంకుల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓ సాధారణ ప్రయాణీకుడు చెల్లించే ఫీజు కంటే ఇది తక్కువగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ లాంచ్ సౌకర్యం అనేది సాధారణంగా ప్రీమియం కార్డు కస్టమర్లకు మాత్రమే అందిస్తుంటారు. 

కోవిడ్ 19 మహమ్మారి సమయంలో బ్యాంకులు ఈ సౌకర్యాన్ని ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ కార్డు హోల్డర్లకు అందించాయి. ఫలితంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు ఉపయోగించుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడీ ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లో మార్పులు వచ్చాయి. 

Also read: Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న రామ్ లల్లా విగ్రహం ఇదే, ఎవరు చెక్కారో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News