Bank Holidays in july 2023: మరో పదిరోజుల్లో జూన్ ముగిసిపోనుంది. జూలై నెల ప్రారంభమౌతుంది. ప్రతి నెలా బ్యాంకులకు కొన్ని సెలవులున్నట్టే జూలైలో కూడా సెలవులున్నాయి. అయితే జూలైలో ఏయే రోజులు సెలవులో తెలుసుకుంటే అందుకు అనుగుణంగా బ్యాంకు పనుల్ని ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ప్రతి నెలలో ప్రతి బ్యాంకుకు ప్రతి ఆదివారంతో పాటు రెండు, నాలుగవ శనివారాలు సెలవులుంటాయి. ఇవి కాకుండా ఇతరత్రా పండుగలు, ప్రత్యేక రోజుల సెలవులుంటాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. అదే విధంగా జూలై 2023 హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జూలై నెలలో ఏకంగా సగం రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. జూలై నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో రెండు, నాలుగవ శనివారాలు, ఆదివారాలతో పాటు ఇతర సెలవులున్నాయి. కొన్ని సెలవులు జాతీయ సెలవులైతే మరికొన్ని ప్రాంతీయ సెలవులుంటాయి. ప్రాంతీయ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.
జూన్ నెల మరి కొద్దిరోజుల్లో ముగిసిపోనుంది. అంటే ఏడాదిలో మొదటి ఆరు నెలలు పూర్తి కానున్నాయి. జూలైలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు వివిధ రకాల సెలవులున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. జూలై నెలలో మొదటి సెలవు జూలై 5వ తేదీన గురు హర్ గోవింద్ జన్మదినం ఉంటే..29వ తేదీన మొహర్రం సెలవుంది.
జూలై 2023 బ్యాంకు సెలవులు
జూలై 4 ఆదివారం సెలవు
జూలై 5 గురు గోవింద్ జయంతి-జమ్ము, శ్రీనగర్‌లో సెలవు
జూలై 6 మిజోరాంలో ఎంహెచ్ఐపీ సెలవు
జూలై 8 రెండవ శనివారం
జూలై 9 ఆదివారం
జూలై 11 త్రిపురలో కేరా పూజా సందర్భంగా సెలవు
జూలై 13 సిక్కింలో భాను జయంతి సెలవు
జూలై 16 ఆదివారం
జూలై 17 మేఘాలయలో యూ తిరోట్ సింగ్ డే
జూలై 22 నాలుగవ శనివారం
జూలై 23 ఆదివారం
జూలై 29 మొహర్రం
జూలై 30 ఆదివారం
జూలై 31 హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో షహాదత్ సెలవు
నిత్యం బ్యాంకు పనులుండేవాళ్లు ఆర్బీఐ విడుదల చేసే బ్యాంకు సెలవుల్ని బట్టి తమ తమ పనులు ప్లాన్ చేసుకుంటే ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకావు. జూలై 2023 బ్యాంకు సెలవుల జాబితాను పదిరోజుల ముందే ప్రకటించింది.
Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మరో పదిరోజుల్లో డీఏపై స్పష్టత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook