Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్​- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం

Reliance Jio: ఎయిర్​టెల్, వొడాఫోన్​ ఐడియాల బాటలో రిలయన్స్ జియో కూడా యూజర్లకు షాకిచ్చింది. ప్రీపెయిడ్​ టారీఫ్​లను పెంచుతూ నిర్ణయించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 08:35 PM IST
  • ఎయిర్​టెల్​, వీఐఎల్​ల బాటలో జియో
  • టారీఫ్​లు పెంచుతున్నట్లు అధికారిక ప్రకటన
  • వచ్చే నెల నుంచే కొత్త ప్లాన్స్ అమలులోకి
Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్​- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం

Reliance Jio has increased its tariffs: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కూడా యూజర్లకు షాకిచ్చింది. ఎయిర్​టెల్, వొడాఫోన్​ ఐడియా బాటలో.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆదివారం (Jio hike Charges) ప్రకటించింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

కొత్త ఛార్జీలు ఇలా..

ప్రస్తుతం ఉన్న ఛార్జీలతో పోలిస్తే.. 20 శాతం పెంపు ఉంటుందని రిలయన్స్ (Reliance Jio hike Tariff) పేర్కొంది.

జియో బేసిక్ ప్లాన్​ను రూ.75 నుంచి రూ.91కి పెంచింది. అయితే ప్లాన్ ప్రయోజనాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ప్లాన్​తో 28 రోజుల వ్యాలిడిటీతో 3జీబీ డేటా, అపరిమిత వాయిస్​ కాల్స్, 50 ఎస్​ఎంఎస్​లు పొందొచ్చు.

అన్​లిమిటెడ్ ప్లాన్స్​లో మార్పులు ఇలా..

రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు, అన్​లిమిటెడ్​ కాల్స్​తో కూడిన 28 రోజుల ప్లాన్ (Jio New plans)​ ధరను రూ.199 నుంచి రూ.239కి పెంచింది. ఇవే ఫీచర్లతో రోజుకు 2జీబీ డేటా వచ్చే ప్లాన్​ను రూ.249 నుంచి రూ.299కి పెంచినట్లు తెలిపింది.

84 రోజలు వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు అపరిమిత కాలింగ్ సదుపాయం (Jio Unlimited plans) ఉండే ప్లాన్​ ధరను రూ.555 నుంచి రూ.666కి పెంచింది జియో. ఇందులోనే రోజుకు 2 జీబీ డేటా అందించే ప్లాన్​ ధరను రూ.599 నుంచి రూ.719కి పెంచినట్లు పేర్కొంది.

వార్షిక ప్లాన్​ (365 రోజులు) ధరను రూ.2,399 నుంచి రూ.2,879కి పెంచింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు, అపరిమిత కాల్స్ అందుతాయి.

యాడ్​ ఆన్​ రీఛార్జ్​ల ధరలను (6జీబీ డేటా) రూ.51 నుంచి రూ.61కి పెంచింది. 12 జీబీ డేటా యాడ్​ ఆన్​ రీఛార్జ్ ధరను రూ.101 నుంచి రూ.121కి, 50 జీబీ డేటా యాడ్ ఆన్​ రీఛార్జ్ ధరను రూ.251 నుంచి రూ.301కి పెంచుతున్నట్లు తెలిపింది జియో.

Also read: Mcap lose: ఐదు రోజులు, 9 కంపెనీలు, నష్టం రూ.2.62 లక్షల కోట్లు!

Also read: November 30 Deadline: నవంబర్ ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News