Aadhar Update 2023: ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబరు లింక్ చేశారా..? ఈజీగా తెలుసుకోండి ఇలా..

How To Verify Mobile Number In Aadhaar: ఆధార్ కార్డులో మొబైల్ నంబరు ఏది ఇచ్చారో చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఆధార్ తీసుకున్నప్పుడు ఇచ్చాం.. ఇప్పుడు గుర్తులేదని అంటుంటారు. అందుకే UIDAI సరికొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 3, 2023, 06:31 AM IST
Aadhar Update 2023: ఆధార్ కార్డుతో మీ మొబైల్ నంబరు లింక్ చేశారా..? ఈజీగా తెలుసుకోండి ఇలా..

ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది లేనిదే మనకు బయట చాలా పనులు జరగవు. ఇంత ముఖ్యమైన కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే తిప్పలు తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ప్రజలకు మరింత సులువుగా సేవలు అందించేందుకు అప్‌డేట్స్‌ తీసుకువస్తోంది. మంగళవారం తన వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో యూఐడీఏఐ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలను ఈజీగా వైరిఫై చేసుకోవచ్చు. చాలామందికి ఏ నంబరును ఆధార్‌తో లింక్ చేశారో కూడా తెలియదు. అలాంటి వారికి ఇక చాలా ఉపయోకరంగా మారనుంది.  

ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసినప్పుడు.. ఈకేవైసీ వెరిఫికేషన్‌కు చేస్తున్నప్పుడు మీ ఆధార్‌తో మొబైల్ నంబరు లింక్ అయిందా..? అని అడుగుతారు. అయితే చాలా మంది ఆధార్ తీసుకున్నప్పుడు ఏదో నంబరు ఇచ్చాం.. ఇప్పుడు గుర్తులేదు.. అని సమాధానం చెబుతుంటారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పడనుంది. తాజా అప్‌డేట్‌తో ప్రజలు తమ ఆధార్‌తో ఏ మొబైల్ లేదా ఈ-మెయిల్ ఐడీ లింక్ చేశారో సులభంగా తెలుసుకోచ్చు.

UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా m-Aadhaar యాప్ ద్వారా 'ఇమెయిల్/మొబైల్ నంబర్' వెరిఫికేషన్ ఫీచర్‌లో పొందవచ్చు. ఒకవేళ మీ మొబైల్ నంబర్ లింక్ చేసినా.. ప్రజలకు తెలియజేస్తుంది. లింక్ చేయకపోతే.. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలని చూపిస్తుంది. 'మొబైల్ నంబర్ ఇప్పటికే ధృవీకరించినట్లయితే.. స్క్రీన్‌పై సందేశం కనిపిస్తుంది. ఆ సందేశంలో మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డుల నుంచి వైరీఫై అయింది అని ఉంటుంది. ఎవరైనా ఆధార్ నంబర్ తీసుకునే సమయంలో ఇచ్చిన తన మొబైల్ నంబర్ గుర్తుకురాకపోతే.. 'మై ఆధార్' పోర్టల్ లేదా mAadhaar యాప్‌లో కొత్త సౌకర్యం కింద మొబైల్ నంబరులో చివరి మూడు అంకెలను చెక్ చేసుకోవచ్చు. ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి..' UIDAI అని వెల్లడించింది.

ఆధార్ కార్డులో మీ ఫోన్‌ నంబర్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..

==> ఆధార్ వెబ్‌సైట్‌ uidai.gov.inలోకి వెళ్లి.. 'లోకేట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్'పై క్లిక్ చేయండి. మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించండి.
==> మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ కార్డ్ సెంటర్‌కు వెళ్లండి.
==> మొబైల్ నంబర్‌ని మార్చడానికి లేదా అప్‌డేట్ చేయడానికి మీకు అక్కడ ఒక ఫారమ్ ఇస్తారు. ఆ ఫారమ్‌లో అవసరమైన వివరాలను నింపండి.
==> మీ వివరాలను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి.. మరోసారి ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు.
==> తరువాత మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని స్లిప్‌ను ప్రింట్ ఇస్తారు. ఇందుకోసం మీ దగ్గర నుంచి రూ.50 ఫీజు వసూలు చేస్తారు.
==> యూఆర్ఎన్‌ నంబరు ద్వారా మీ ఆధార్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. myaadhaar.uidai.gov.in/కి వెళ్లి.. చెక్ ఎన్‌రోల్‌మెంట్&అప్‌డేట్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. 
==> యూఆర్ఎన్‌ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. 90 రోజుల్లో UIDAI డేటాబేస్‌లో మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.

Also Read: GT Vs DC Highlights: వాట్ ఏ గేమ్‌.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ విక్టరీ.. గుజరాత్‌కు వార్నర్ సేన చెక్  

Also Read: Indore Crane Accident: ఘోర విషాదం.. క్రేన్ కింద పడి నలుగురు దుర్మరణం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News