7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు తరువాత కీలక ప్రకటన

HBA Interest Rates: డీఏ పెంపు తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్‌బీఎ)పై తీసుకునే వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల సొంతింటి కల మరింత నెరవేరబోతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 11:55 AM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు తరువాత కీలక ప్రకటన

HBA Interest Rates: కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి మరో తీపి కబురు వచ్చింది. ఉద్యోగుల తమ సొంత ఇంటిని మరింత సులభంగా నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్‌బీఎ) అంటే బ్యాంకు నుంచి ఉద్యోగులు (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు) తీసుకునే గృహ రుణంపై వడ్డీ రేటును 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగుల సొంత ఇంటి కల మరింత సులభతరం కానుంది. ఈ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం బ్యాంకు నుంచి తీసుకున్న గృహ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం ఉద్యోగుల అడ్వాన్స్‌పై వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే 0.8 శాతం కోత విధించింది.

కేంద్ర ఉద్యోగులు ఇప్పుడు చౌకగా ఇళ్లు నిర్మించుకోవచ్చు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడ్వాన్స్ వడ్డీ రేట్ల తగ్గింపు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మెమోరాండం ప్రకారం.. ఉద్యోగులు 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో మార్చి 31, 2023 వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ వడ్డీ రేటు గతేడాది 7.9 శాతంగా ఉంది. 

ఎంత అడ్వాన్స్ తీసుకోవచ్చు..?

దీని కింద కేంద్ర ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ ప్రకారం 34 నెలల వరకు లేదా గరిష్టంగా రూ.25 లక్షల వరకు తీసుకోవచ్చు. అలాగే ఇంటి ఖరీదు లేదా తిరిగి చెల్లించే సామర్థ్యం ఉద్యోగులకు ఏది తక్కువైతే అది అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. ఈ సదుపాయంతో ప్రభుత్వోద్యోగుల సొంతింటి కల మరింత సులభం కానుంది. 

హెబీఏ అంటే..?

హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్  పథకాన్ని 2020 అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద 31 మార్చి 2023 వరకు ఉద్యోగులకు 7.1 శాతం వడ్డీ రేటుతో గృహ నిర్మాణ అడ్వాన్స్‌ని ఇస్తుంది. కేంద్ర ఉద్యోగి తన లేదా అతని భార్య పేరు మీద ప్లాట్‌లో ఇల్లు నిర్మించుకోవడానికి అడ్వాన్స్ తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Hyderabad Metro: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రెండో దశ మెట్రోకు ముహుర్తం ఫిక్స్  

Also Read: Dil Raju Varisu : 75 ఏళ్ల చరిత్రలో ఇలా జరగలేదు.. 'వారసుడు' వివాదంపై దిల్ రాజు కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News