Jagananne Maa Bhavishyathu: 7 లక్షల మందితో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'.. ఈ నెల 7న శ్రీకారం

Jagananne Maa Bhavishyathu Programme Full Details: ఏపీలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2023, 08:29 PM IST
Jagananne Maa Bhavishyathu: 7 లక్షల మందితో ప్రతి ఇంటికీ 'జగనన్నే మా భవిష్యత్తు'.. ఈ నెల 7న శ్రీకారం

Jagananne Maa Bhavishyathu Programme Full Details: రాష్ట్రంలోని పట్టణాల నుంచి మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి వివరించేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం 'జగనన్నే మా భవిష్యత్తు'.. 'మా నమ్మకం నువ్వే జగన్'. రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ 7 లక్షల మంది కార్యకర్తలతో ఓ సైన్యాన్ని నియమించింది. ప్రతి గ్రామ సచివాలయానికి ముగ్గురు చొప్పున కన్వీనర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏ రాజకీయ పార్టీ ఇదివరకు చేయని భారీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రారంభించి ఏప్రిల్ 20వ తేదీ వరకు అంటే 14 రోజుల ­పాటు కొనసాగనుంది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ, అభివృద్ధి ఫలాలను వివరించనున్నారు.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాల స్థానంలో వాస్తవాలను ప్రజలకు వివరించనున్నారు. 'పీపుల్స్‌ సర్వే'లో భాగంగా ప్రతి ఇంట్లోనూ పౌరులను ఐదు ప్రశ్నలు అడిగి.. వారు చెప్పిన సమాధానాలను 'ప్రజా మద్దతు పుస్తకం'లో నమోదుచేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహసారథులు విజ్ణప్తి చేస్తారు. ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడిన ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుంది.
 
ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండాను రూపొందించుకుని పనిచేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్‌ ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ భవిష్యత్తులో గర్వంగా చెప్పుకునేందుకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి..? తమ పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ కూడా ఇప్పించారు.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వాడవాడలా ప్లకార్డ్ ప్రదర్శన క్యార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించి, వారితో స్వచ్ఛందంగా ప్లకార్డు ప్రదర్శించి ప్రజలు మద్ధతుతును సమీకరించి వాటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

Also Read: Ola S1 Pro Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

Also Read: Forbes list 2023: ఆసియా కుబేరుడిగా ముకేష్ అంబానీ, ఫోర్బ్స్ జాబితా నుంచి అదానీ అవుట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News