Central government: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న వైసీపీ ఎంపీలు

Central government: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2021, 03:54 PM IST
Central government: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న వైసీపీ ఎంపీలు

Central government: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. తెలుగు ప్రజలందరికీ కేంద్రం ద్రోహం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల( Parliament Monsoon Sessions) నేపధ్యంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశానికి హాజరైన వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కీలక విషయాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లవుతున్నా..విభజన చట్టం హామీలు నెరవేర్చకుండా కేంద్రం తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. బీజేపీ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని నష్టాల్నించి లాభాల్లో తీసుకురావాలని..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరినట్టు విజయసాయి రెడ్డి(Vijayasai reddy) తెలిపారు బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాల్ని అనుసరిస్తోందని..ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దిశ బిల్లు క్లియరెన్స్, సీఆర్డీఏ, ఏపీ ఫైబర్, అంతర్వేది రధం దగ్దం వంటి అంశాలపై సీబీఐ విచారణ కోరామని గుర్తు చేశారు. ఫిరాయింపు అంశాలపై కేంద్రం వైఖరి సరిగ్గా లేదని..అనర్హత పిటీషన్‌పై కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 

మరోవైపు జాతీయ హోదా కలిగిన పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి (Central government) ఉద్దేశ్యపూర్వక కాలయాపనేనని స్పష్టం చేశారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలిచాలని కోరామన్నారు. విశాఖపట్న ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న బీజేపీ..ఏపీకు ఎందుకివ్వడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్నారు.పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాలని కోరామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావల్సి ఉందని..కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. 

Also read: AP Government: రాష్ట్రంలో భారీగా ఉక్కు పరిశ్రమలు, క్యూ కడుతున్న కంపెనీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News