Youth Marries Goat: ఓవైపు వయసైపోతుంటుంది.. మరోవైపు వచ్చిన సంబంధాలు వచ్చినట్లే పోతుంటాయి... ఇక ఈ జీవితంలో పెళ్లి కాదేమోనన్న ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరుతుంది. ఇలా పెళ్లి కాని ప్రసాద్‌ల బాధ వర్ణనాతీతం. ఓవైపు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూనే.. మరోవైపు దోష నివారణలు, పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. అదే సమయంలో జ్యోతిష్యుల సూచన మేరకు చెట్లకు లేదా జంతువులకు తాళి కట్టడం చేస్తుంటారు. తాజాగా ఏపీలోని నూజివీడులోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
నూజివీడుకి చెందిన ఓ యువకుడికి అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే సంబంధాలు సెట్ కాకపోవడంతో జ్యోతిష్యుడిని ఆశ్రయించారు. ఆ యువకుడి సంబంధం చూసిన జ్యోతిష్యుడు... అతని జాతకంలో రెండు పెళ్లిళ్లు ఉన్నట్లు చెప్పాడు. ఆ దోష నివారణకు ఓ మేకతో పెళ్లి జరిపించాలని సూచించాడు. దీంతో పురోహితుడు పెట్టిన ముహూర్తానికి ఆ యువకుడు మేక మెడలో తాళి కట్టాడు. యువకుడి తల్లిదండ్రులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటి పెళ్లి మేకతో జరగడంతో ఇక రెండో పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయని... ఇక మంచి సంబంధం కుదురుతుందని యువకుడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు మేకను పెళ్లి చేసుకోవడమేంటని షాకవుతున్నారు. టెక్నాలజీ ఇంత అభివృద్ది చెందిన ప్రస్తుత కాలంలోనూ ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలేంటని అభిప్రాయపడుతున్నారు.
Niharika Konidela: నిహారిక తప్పు లేదు.. అనవసర ఊహాగానాలు వద్దు... నాగబాబు రియాక్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook