ఎన్నికల సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరుపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ ను కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
సత్తెనపల్లి ఘటనను ప్రస్తావిస్తూ ఇనుమెట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి లోపల అధికారులు ఉండగానే తలుపులు బిగించుకున్నారని... అక్కడున్న సాధారణ ఓటర్లు ఆయన వైఖరిని ప్రశ్నిస్తే తనంతటతానుగా బట్టలు చించుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని జగన్ పేర్కొన్నారు
కోడెల పోలింగ్ బూత్ లో ఓటర్లను బెదిరించారని జగన్ విమర్శించారు. కోడెల తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ.. తనపై దాడి చేశారంటూ బాధితులపైనే కేసులు పెడుతున్నారని..ఇదే విషయాన్ని గవర్నర్ కు దృష్టి కి తీసుకెళ్లినట్లు జగన్ పేర్కొన్నారు