Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలు

Vyjayanthi Movies Huge Donation To AP CMRF: ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు వచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఏపీకి ఉదారంగా విరాళాలు అందించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 2, 2024, 11:46 PM IST
Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలు

Vyjayanthi Movies Donation: వరదలతో విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు ఆపన్నహస్తం అందుతోంది. భారీ వర్షాలు.. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తొలి విరాళాన్ని అందించగా.. 'రేపటి కోసం' అంటూ ప్రముఖ సినీ సంస్థ వైజయంతి మూవీస్‌ భారీ విరాళాన్ని అందించింది. ఆపదలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు అంటూ విరాళం ప్రకటించారు.

Also Read: Vijayawada Floods: శాంతించిన కృష్ణమ్మ.. వరద తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ నుంచి వైజయంతి మూవీస్‌ ముందుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహయ నిధికి రూ.25 లక్షలు విరాళం ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. 'రేపటి కోసం' అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన చేసింది. 'ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత. ఈ విపత్కర సమయంలో మేమివ్వడం బాధ్యతగా భావిస్తున్నాం. ఈ పని చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల పట్ల ప్రేమ, గౌరవం ఉందని మేము చెప్పాలనుకుంటున్నాం. ఒకరికొకరు పరస్పరం సహకరించుకుని ఐక్యంగా నిలబడదాం' అంటూ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: Schools Holiday: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా వర్షం ముప్పు.. రేపు కూడా సెలవు ప్రకటన

 

ఇక సినీ పరిశ్రమ నుంచి మరో విరాళం కూడా అందనుంది. ఇటీవల మంచి టాక్‌తో విజయంతంగా దూసుకెళ్తున్న 'ఆయ్‌' సినిమా బృందం వరద బాధితులకు అండగా నిలిచింది. సోమవారం నుంచి ఆదివారం వరకు సినిమాకు వచ్చే రాబడిలో నిర్మాత భాగంలో 25 శాతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే అదే స్థాయిలో వరదలతో విలవిలలాడుతున్న తెలంగాణకు మాత్రం సినీ పరిశ్రమ నుంచి విరాళం అందలేదు. వైజయంతి మూవీస్‌ తెలంగాణకు రూపాయి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. అంతేకాకుండా వారి కుటుంబం తరఫున కూడా విరాళం అందింది. ఆయన కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్  నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఏపీ, తెలంగాణకు రూ 2.5 లక్షల చొప్పున.. కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున ఇరు రాష్ట్రాలకు రూ 2.5 లక్షలు అందజేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News