2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?

Anantapur Container: కంటైనర్ లో భారీగా డబ్బులు దొరకడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో చివరకు పోలీసులకు బిగ్ ట్విస్ట్ఎదురైంది.

Written by - Inamdar Paresh | Last Updated : May 2, 2024, 06:14 PM IST
  • షాకింగ్ లో పోలీసులు..
  • నాలుగు కంటైనర్ లలో భారీగా డబ్బుల కట్టలు..
2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?

Two thousand Crore cash Found in Heavy containers at anantapur: కేంద్రం ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ అమల్లో ఉంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుంటారు. ముఖ్యంగా రహాదారుల మీద, హైవేల మీద వాహానాలు ఏమాత్రం అనుమానస్పదంగా ఉన్న పోలీసులు ఆపీ మరీ తనిఖీలు చేస్తుంటారు. అంతేకాకుండా ఎక్కడైన భారీగా నగదు దొరికితే పొలీసులు సరైన పత్రాలను కోసం ఎంక్వైరీలు చేస్తారు. ఒక వేళ దొరికిన డబ్బులకు సరైన విధంగా పత్రాలు లేకపోయినట్లైతే పోలీసులు ఆనగదును సీజ్ చేస్తుంటారు. ఇది మనం తరచుగా చూస్తుంటాం.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా గతంలో వచ్చింది. ఆ మూవీలో ఒక కంటైనర్ నిండా డబ్బులను పెట్టి దేశం దాటించే ప్రయత్నం చేసినప్పడు అల్లుఅర్జున్, విలన్ల బారీ నుంచి కంటైనర్ లో ఉన్న డబ్బులను సేవ్ చేస్తాడు. అయితే... ఇక్కడి పోలీసులు తమ విధుల్లో భాగంగా తనిఖీలే చేపడుతుండగా.. నాలుగు కంటైనర్ లలో దాదాపు 2000 వేల కోట్లను డబ్బులను పోలీసులు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అసలే ఎన్నికలు.. అంత మొత్తంలో డబ్బులు దొరకడంతో పోలీసులు అవాక్కైయ్యారు.

దీనిపై ఆరాతీయగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాసిట్ చేసేందుకు, నాలుగు కంటైనర్ లు కేరళలోని కొచ్చి నుంచి హైదరబాద్ కు వెళ్తున్నాయని తెలిసింది. దీంతో పోలీసులు,ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఊపిరీపీల్చుకున్నారు. తొలుత.. ఇది పొలిటియన్స్ డబ్బులా.. ఎవరైన బ్లాక్ మనీ.. అంటూ అనేక విధాలు అనుమానించారు.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

చివరకు ఇది పోలీసులు డబ్బులు బ్యాంక్ లో జమచేయాల్సిన డబ్బులు అని తేలడంతో దీనిపై పత్రాలను చెక్ చేసి వాహానాలను పంపించి వేసినట్లు తెలుస్తోంది. నాలుగు కంటైనర్ లలో దాదాపు.. 500 కోట్ల చొప్పున ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఈ ఘటన మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించుకునేందుకు అనేక చర్యలుచేపట్టింది. ఏపీలో అనేక మంది అధికారులకు స్థాన చలనం కల్గించిన విషయం తెలిసిందే. ఎక్కడ కూడా ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలని చూస్తే సహించేదిలేదంటూ స్పష్టం చేసింది. డబ్బులు, మద్యం రవాణా కాకుండా పోలీసులు పకట్భందీ చర్యలు చేపట్టారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News