TTD Tickets: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

TTD Vaikunta Dwara Darshan Tickets: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. రోజుకు 22,500 చొప్పున 2.25 లక్షల టికెట్లు విడుదల కానున్నాయి.

Written by - Ashok Krindinti | Last Updated : Nov 10, 2023, 08:37 AM IST
TTD Tickets: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

TTD Vaikunta Dwara Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా డిసెంబ‌రు 22న తిరుప‌తిలో 4.25 ల‌క్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబరు 23వ తేదీ నుంచి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. ఇందుకుసంబంధించి రూ.300 కోటా కింద 2.25 ల‌క్షల దర్శన టికెట్లు నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు. తిరుప‌తిలో 9 కేంద్రాల‌లో 100 కౌంట‌ర్ల‌లో డిసెంబ‌రు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు  టైమ్‌స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేస్తామన్నారు. వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

 శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లను రోజుకు 22,500 చొప్పున 2.25 లక్షల టికెట్లు విడుదల చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు 20వేల శ్రీవాణి టికెట్లు విడుదల చేస్తుంది. సాయంత్రం 5 గంటలకు గదుల కోటా రిలీజ్ చేస్తుంది.

రోజుకు రెండు వేల‌ శ్రీవాణి టికెట్లు 

రోజుకు రెండు వేల‌ శ్రీవాణి టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23 నుంచి 2024 జ‌న‌వ‌రి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2 వేల టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలని చెప్పారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుందన్నారు.

అదేవిధంగా ఈ నెల 12న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ముందు ఒక రోజు అంటే.. రేపటి నుంచి బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించమని చెప్పారు. ఆస్థానం కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌ల‌ను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా జరుగుతాయని వెల్లడించారు. భక్తులు గమనించాలని కోరారు.

Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   

Also Read: Pakistan Semi Final Scenario: పాక్ సెమీస్‌కు రావాలంటే ఇలా జరగాలి.. టాస్‌పైనే భవితవ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News