Tirupati Bypoll: తిరుపతిలో మత రాజకీయాలు చేయవద్దని హెచ్చరిక

Tirupati Bypoll: ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉప ఎన్నికల్లో మతం ఆధారంగా ఆరోపణలు తీవ్రమౌతుండటంతో అధికార పార్టీ మండి పడుతోంది. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయవద్దని హెచ్చరిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2021, 03:57 PM IST
Tirupati Bypoll: తిరుపతిలో మత రాజకీయాలు చేయవద్దని హెచ్చరిక

Tirupati Bypoll: ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉప ఎన్నికల్లో మతం ఆధారంగా ఆరోపణలు తీవ్రమౌతుండటంతో అధికార పార్టీ మండి పడుతోంది. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయవద్దని హెచ్చరిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు.

ఏపీలో ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక( Tirupati Bypoll) జరగనుంది. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తిరుపతిలో మత ప్రశాంతతకు భంగం కల్గించవద్దని..ప్రతిపక్షాల నీచ పనులకు దేవుడే శిక్ష విధిస్తాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ( Karunakar reddy) స్పష్టం చేశారు. మతాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నిన్నటి వరకూ బీజేపీ ( Bjp) ని విమర్సించిన వ్యక్తి ఇవాళ మద్దతివ్వడం శోచనీయమన్నారు. మత ప్రేరేపణలతో అధికార పార్టీని ఓడించాలనే కుట్ర జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు నీచ సంస్కృతికి పాల్పడుతున్నాయని..టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆలయాల్ని కూల్చిన చరిత్ర చంద్రబాబు ( Chandrababu) దేనని ధ్వజమెత్తారు. 

ఆలయాలపై దాడుల వెనుక తెలుగుదేశం (Telugu Desam)కార్యకర్తలున్నారనే విషయం అందరికీ తెలుసని భూమన తెలిపారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడకుండా దేవుడ్ని అస్త్రంగా చేసుకుంటున్నారన్నారు. భగవంతుడిపై విశ్వాసమున్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. దేవుడిని రాజకీయ వనరుగా మార్చుకునేవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని దుయ్యబట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని..మత విద్వేషాలు లేని రాష్ట్రం ఏపీ అని గుర్తు చేశారు. 

Also read: Pawan Kalyan on CM post: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News