TTD Chiarman Bhumana Karunakar Reddy: అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని తెలిపారు. రెండు నెలల్లో చిక్కిన ఐదవ చిరుత అని చెప్పారు. భక్తులు భద్రత విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు.
అటవీశాఖ అధికారుల సహకారంతో దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు భూమన. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే ఐదో చిరుతను ఈ రోజు పట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు చిరుత పులి దాడికి గురయ్యారని.. అందులో ఒక పాప మరణించినట్లు తెలిపారు. ఆ తర్వాత మరింత అప్రమత్తతో నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని సూచించామని చెప్పారు. వారితో పాటు తోడుగా భద్రత సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు చేశామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.
"భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం నిన్నటి నుంచి చేతి కర్రలు కూడా ఇవ్వడం ప్రారంభించామం. భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి, అదనపు భద్రత కల్పిస్తూనే అదనంగా కర్రలు ఇస్తున్నారు. భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుంది.." అని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి