బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజ చంద్రబాబు చెన్నై వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన సాయంత్రం డీఎంకే అధినేత స్టాలిన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా 2019 ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి.. మోడీ సర్కార్ ను గద్దెదించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, దీనికి సంబంధించిన కార్యచరణ ఎలా ఉండాలన్న దానిపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
బీజేపీని ఎదుర్కొనే దక్షిణాధి ఫార్ములా
రాష్ట్రాలకు కేంద్రం చేసినటువంటి అన్యాయం..ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై ఈ సందర్భంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బీజేపీని ఎదుర్కొనే దక్షిణాధి ఫార్ములాపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ బీజేపీ పరోక్ష మద్దుతు ఇస్తున్న నేపథ్యంలో బీజేపీకి కట్టడి చేయలని స్టాలిన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, స్టాలిన్ ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబు సక్సెస్ అయ్యేనా ?
బీజేపీతో జరిగే పోరులో ఇప్పటికే కాంగ్రెస్ తో చేయి కలిపిన చంద్రబాబు.. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీని వ్యతిరేకించే పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలను కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయిన చంద్రబాబు నిన్న దేవేగౌడను కలుసుకున్నారు. ఈ రోజు తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న డీఎంకే నేతలతో భేటీకానున్నరు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో చంద్రబాబు ఈ పర్యటనలో ఏ మేరకు ప్రభావితం చేస్తారనే అంశంపై ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.