పోలవరం రీ టెండరింగ్ వ్యవహారం పై రగడ !!

పోలవరం రీ టెండరింగ్ వ్యవహారం పై రగడ  

Last Updated : Sep 24, 2019, 01:56 PM IST
పోలవరం రీ టెండరింగ్ వ్యవహారం పై రగడ !!

పోలవరం పనులకు సంబంధించిన టెండర్లు దక్కించుకునేందుకు మేఘా కంపెనీ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారంది. రీటెండరింగ్ ప్రక్రియపై టీడీపీ ఆరోపణలు సంధిస్తోంది. ఈ అంశంపై టీడీపీ సీనియర్  నేత రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మేఘా సంస్థతో జగన్ చీకటి ఒప్పందుకు కుదుర్చుకున్నారని విమర్శించారు. టెండర్లకు ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా ప్రభుత్వం బెదిరించిందని ఆరోపించారు. మేఘా, మ్యాక్స్ ఇన్ఫ్రా కంపెనీలకు పోలవరం ప్రాజెక్టు చేపట్టే అర్హత లేదని గతంలో వైసీపీ నేతలే విమర్శలు సంధించారన్న  విషయాన్ని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రస్తాద్ గుర్తు చేశారు. 

వైసీపీ కౌంటర్ ఎటాక్

మరోవైపు వైసీపీ నేతలు టీడీపీపై ఎదురు దాడి చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును గతంలో కంటే  12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చిందని...దీనివల్ల ప్రభుత్వానికి 628 మొత్తంలో నిధులు ఆదా అవుతుందని సమర్ధిస్తున్నారు. ఇది చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి చవకబారు ఆరోపణలు సంధిస్తోందన్నారు. వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని టీడీపీకి వైసీపీ నేతలు చరుకలు అంటిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసిన ఏపీ సర్కార్ తిరిగి టెండర్ను పిలవడంతో ఈ మహా ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులు  దక్కింకునేందుకు మేఘా సంస్థ ముందకు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలవరం రీ టెండర్ల ప్రక్రియపై రగడ మొదలైంది.
 

Trending News