MLC Ashok Babu Arrest: అర్ధరాత్రి ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేసిన సీఐడీ

Andhra Pradesh, MLC Ashok Babu Arrest: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గతంలో ఉద్యోగం చేసిన సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 10:30 AM IST
  • టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్
  • అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • విద్యార్హత విషయంలో అశోక్ బాబు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు
 MLC Ashok Babu Arrest: అర్ధరాత్రి ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేసిన సీఐడీ

Andhra Pradesh, MLC Ashok Babu Arrest: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో విజయవాడలోని అశోక్ బాబు నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసిన సమయంలో విద్యార్హతను తప్పుగా చూపించినట్లు అశోక్ బాబుపై ఆరోపణలున్నాయి. విద్యార్హతకు సంబంధించి అశోక్ బాబు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లుగా కేసు నమోదవడంతో సీఐడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అశోక్ బాబు అరెస్టును టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. సర్వీస్ సంబంధిత విషయాల్లో తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసే ప్రతీ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అశోక్ బాబు అరెస్టుపై స్పందిస్తూ.. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందునే ఆయన్ను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, గతంలో అశోక్ బాబు అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా పని చేసిన సమయంలో తప్పుడు సమాచారంతో రికార్డులను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. బీకాం చదవనప్పటికీ చదివినట్లుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లోనూ విద్యార్హతకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై పై ఐపీసీ 477A, 465, 420 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మొదట లోకాయుక్తలో అశోక్ బాబుపై కేసు నమోదవగా.. ఆ తర్వాత సమగ్ర విచారణ నిమిత్తం సీఐడీకి కేసు బదిలీ అయింది. ప్రస్తుతం సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: Gold Price Today : నేటి బంగారం ధరల వివరాలు.. ఏయే నగరాల్లో ఎంత ధర అంటే..

Also Read: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాళ్లు.. కొంపదీసి స్విగ్గీ డెలివరీ చేసుకుంటారా ఏంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News