Kodali Nani: క్యాసినో మంత్రి అంటూ కొడాలి నానిపై టీడీపీ నేతల విమర్శలు!

Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కెసినో మంత్రిగా పేరు తెచ్చుకున్నారని విమర్శలు చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 02:35 PM IST
  • ఏపీ మంత్రి కొడాలని నానిపై టీడీపీ నేతల విమర్శలు
  • కె కన్వెన్షన్​లో కెసినో నిర్వహణ అంశంపై విసుర్లు
  • టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకోవడంపై ఆగ్రహం!
Kodali Nani: క్యాసినో మంత్రి అంటూ కొడాలి నానిపై టీడీపీ నేతల విమర్శలు!

Kodali Nani: ఆంధ్ర ప్రదేశ్​ పౌర సరఫరాల మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రా, మాజీ ఎంపీ నారాయణ రావు సంచలన వాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కె కన్వెన్షన్‌ సెంటర్లో కెసినో నిర్వహించారనే అంశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ (TDP meeting in Gudivada) శ్రేణులు.

ఈ సమావేశంలో.. మంత్రి జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నారాయణ రావు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఎన్నడూ సమావేశం ఏర్పాటు చేయని మంత్రి కొడాలి నాని.. నేడు అత్యవసరంగా కె కన్వెన్షన్​లో ఎస్పీ సెల్ సమావేశం నిర్వహించడం చూస్తే అతను భయపడుతున్నట్లు అర్థమవుతుందని (Ex MP Narayana Rao on Kodali nani) విమర్శించారు.

ఇక మాజీ మంత్రి కొల్లు రవీంద్రా ఏకంగా కొడాలని నానిని కెసినో మంత్రిగా అభివర్ణించారు.

గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కొడాలని నాని క్రమ శిక్షణతో మెలిగినట్లు తెలిపారు. వైసీపీలోకి వెళ్లాకే బూతుల మంత్రిగా మారారని (TDP leaders Kollu Ravindra  on Kodali Nani) అన్నారు. ఇప్పుడు పేకాట మంత్రిగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. భవిష్యత్​లో నాని అరాచకం ఏ స్థాయికి చేరుతుందో ఊహించలేమన్నారు.

అసలు వివాదం ఏమింటంటే..

మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన కృష్ణ జిల్లా గడివాడలో సంక్రాంతి సందర్భంగా ఇటీవల కేసినో నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. అది కూడా మంత్రికి చెందిన కె కన్వెన్షన్​లోనే ఈ తతంగం జరిగినట్లు టీడీపీ (Kodali Nani Casino Issue) ఆరోపణలు చేస్తోంది.

నేడు ఈ విషయంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని నిర్ణయించగా.. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో గుడివాడలో (High Tesnsion in Gudivada) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Also read: One District-One Airport: కొత్త విమానాశ్రయాలతో పాటు పోర్టులు, హార్బర్లు, దేశంలోనే అగ్రగామిగా ఏపీ

Also read: AP Cabinet: పీఆర్సీ, కరోనా మహమ్మారి కీలకాంశాలపై కేబినెట్ భేటీ నేడే, మంత్రివర్గ మార్పుపై వార్తలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News