పాసింజర్ రైల్లో షార్ట్ సర్క్యూట్,  ప్రమాణికులకు కరెంట్ షాక్ !!

ఏపీకి చెందిన ఓ పాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

Last Updated : May 4, 2019, 01:24 PM IST
పాసింజర్ రైల్లో షార్ట్ సర్క్యూట్,  ప్రమాణికులకు కరెంట్ షాక్ !!

గుంటూరు-ఒంగోలు ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో రైల్లోని  ఓ బోగీలో ప్రయాణికులకు కరెంట్ షాక్ తగిలింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం షార్ట్స్ సర్క్యూట్ సంభించిన వెంటనే పలువురు ప్రయాణికులు రైలు బోగీ నుంచి దూకేశారు. కాగా బోగీలో ఉన్న పలువురు అస్వస్థత గురయ్యారు. గాయపడ్డ ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 

ఈ ఘటనతో అప్రమత్తంమైన రైల్వే అధికారులు ప్రమాదానికి గురైన బోగీకి అధికారులు తొలుత విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.  రైలు వేజెండ్ల స్టేషన్ కు వద్దకు చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో  షార్ట్ సర్క్యూట్ జరిగి ఓ బోగీలో విద్యుత్ ప్రవహించిందని రైల్వే అధికారులు వివరించారు. షార్ట్ సర్క్యూట్ కు గురైన బోగికి తొలగించి మరో బోగీని జతచేసి పంపించినట్లు పేర్కొన్నారు

Trending News