AP 10th Papers Leak: పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వెనుక కారణాలివేనా, నిజమెంత

AP 10th Papers Leak: ఏపీలో పదవ తరగతి పరీక్షలు మరో మూడ్రోజుల్లో ముగుస్తున్నాయి. ప్రతిరోజూ పేపర్ లీక్ వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. అసలేం జరిగింది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2022, 10:46 PM IST
  • ఏపీ పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వెనుక సంచలన నిజాలు
  • లీకేజ్ వ్యవహారంలో అరెస్టైన 44 మంది టీచర్లలో 30 మంది ప్రభుత్వ టీచర్లే
  • ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు చేశారనే విమర్శలు
 AP 10th Papers Leak: పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వెనుక కారణాలివేనా, నిజమెంత

AP 10th Papers Leak: ఏపీలో పదవ తరగతి పరీక్షలు మరో మూడ్రోజుల్లో ముగుస్తున్నాయి. ప్రతిరోజూ పేపర్ లీక్ వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగు చూస్తున్నాయి. అసలేం జరిగింది..

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల విషయంలో ప్రతిరోజూ పేపర్ లీక్ వార్తలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా పేపర్ లీక్ వార్తలు రావడం, పరీక్ష ప్రశ్నాపత్రాలు వాట్సప్‌లలో ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దర్యాప్తు చేసి కొంతమందిని అరెస్టు చేయడంతో అసలు విషయం బయటికొచ్చింది.

ఏపీ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీషు పేపర్లు..పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికి వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. మేథ్స్ మాత్రం పరీక్షకు ముందే వాట్సప్ గ్రూపుల్లో వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దర్యాప్తు తీవ్రం చేసింది. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్టు పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ చేయడమే కాకుండా..ఏలూరు జిల్లాలోని విద్యార్ధులకు సమాధాన పత్రాలు కూడా ఇచ్చినట్టు తెలిసింది. అటు కృష్ణా జిల్లా పామర్రులో కూడా పేపర్ లీక్ అయింది. ఈ వ్యవహారంపై 9మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో ఏడుగురు టీచర్లే కావడం గమనార్హం.

ప్రభుత్వ టీచర్ల పాత్ర..కారణాలేంటి

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వ్యవహారంలో పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ ఘటనల్లో 44 మంది అరెస్టైతే..30 మంది ప్రభుత్వ టీచర్లే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీక్ ఘటనల్లో ప్రైవేట్ టీచర్ల కంటే ప్రభుత్వ టీచర్లే అధికంగా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఇటీవల జరిగిన ఉద్యోగుల సమ్మె విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మద్య చర్చలు సఫలమైనా..టీచర్లు మాత్రం సమ్మె కొనసాగించడం ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వంపై కక్ష్యతో, అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారనే వాదన విన్పిస్తోంది. మరోవైపు టీచర్ల వెనుక ఎవరి ప్రమేయముందనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకోవైపు స్కూళ్లకు ప్రభుత్వం విధించిన పాస్ పర్సంటేజ్ టార్గెట్ల కారణంగా టీచర్లు ఇలా చేశారనే వాదన కూడా ఉంది. 

Also read: AP 10th Class Exams: ఏపీలో పదో తరగతి పరీక్షల తీరుపై దుమారం..మరోసారి పేపర్ లీక్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News