కేంద్రంతో ఇబ్బందులు: టీజీ వెంకటేష్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బీజేపీపై నిరసన తెలిపారు.

Last Updated : Jan 1, 2018, 05:20 PM IST
కేంద్రంతో ఇబ్బందులు: టీజీ వెంకటేష్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బీజేపీపై నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు. కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. 

నోట్లరద్దు, జీఎస్టీలతో ప్రజలు తికమకపడుతున్నారని.. ఇప్పటికీ అవేంటో ప్రజలకు అర్థంకావటంలేదని కలెక్టరేట్ సమావేశంలో చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. మైనార్టీలకు రాజ్యాంగ పరంగా హక్కులు, రక్షణ చట్టాలపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చట్టసవరణలు చేస్తే బాగుణ్ణు అన్నారు. త్రిపుల్ తలాక్ తొందరపాటు నిర్ణయమేనని అన్నారు. తలాక్ రద్దు చేసినప్పుడు మూడేళ్లు జైలుశిక్ష విధిస్తామంటున్నారని.. అది ఎలా సాధ్యమని కేంద్రాన్ని ప్రశ్నించారు. సున్నితమైన అంశాలలో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఈ అంశాలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు.

Trending News