తిరుపతికి చేరుకున్న ప్రధాని మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం

మాల్దీవులు, శ్రీలంక పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది

Last Updated : Jun 9, 2019, 05:42 PM IST
తిరుపతికి చేరుకున్న ప్రధాని మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం

తిరుపతి: మాల్దీవులు, శ్రీలంక పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో భారీ సంఖ్యలో బీజేపి నేతలు, కార్యకర్తలు సైతం ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఉత్సాహం కనబర్చారు. తిరుపతి, తిరుమల వీధుల్లో అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

నేడు సాయంత్రం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ ఆ తర్వాత రాత్రి 8.15 గంటలకు తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. అంతకన్నా ముందుగా ఆయన బీజేపి నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. ప్రధాని మోదీతోపాటు గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

Trending News