Pawan Kalyan about Chandrababu naidu: ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడం అందరిని కలచివేసింది. దీనితో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది.
తాజాగా ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ఓ పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే.. ప్రజాప్రతినిధులు తమకు ఏమీ పట్టనంట్టుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాజకియాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులను కించపరచటం తగదు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/HeUF2ENXM3
— JanaSena Party (@JanaSenaParty) November 19, 2021
ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయాలపై ఏహ్యభావం కలిగిస్తాయన్నారు. టీవీ చర్చల్లోనూ కొన్ని సార్లు సిగ్గుతో తలదించుకునే పదాలు వాడుతున్నారని తెలిపారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఖండించాల్సిన అవసరముందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
Also read: సాగు చట్టాల రద్దుపై పవన్ కల్యాణ్ రియాక్షన్... ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారంటూ...
చంద్రబాబు శపథం..
అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేయడంపై మీడియాతో చెపేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాడ్లాడారు. ఈ విషయం గురించి చెబుతూ..చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మ పోరాటంలో ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని తెలిపారు. అంతవరకూ అసెంబ్లీకి వెళ్లనని చెప్పారు. ఈ విషయాన్ని అక్కడే చెప్పాలనుకున్నా మైక్ ఇవ్వలేదని వెల్లడించారు. తనకు పదవులు అంటే వ్యామోహం లేదని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.
Also read: ఏపీ పాలిసెట్ 2వ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపుపై లేటెస్ట్ అప్డేట్స్
Also read: తిరుపతి, తిరుమలలో జలవిలయం...స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook