Pawan Kalyan About Life Threat and Supari Gangs: కాకినాడ: అధికారం చేజిక్కించుకునే నాయకులు కృూరంగా ఆలోచిస్తారని.. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని బలంగా భావిస్తారని.. అవసరమైతే కడుపులోని బిడ్డను కూడా చంపడానికి వెనుకాడరని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనకు కూడా ప్రాణ హానీ ఉందని.. తన కోసం ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారని స్పష్టమైన సమాచారం ఉంది అని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడలో శనివారం సాయంత్రం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలతో జరిగిన సమావేశంలో వారిని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, " అధికారం నిలబెట్టుకునేందుకు నాయకులు ఎంతకైనా తెగిస్తారు. బాలు సినిమా సమయంలో ఓ ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నారా అని అడిగారు.. ఎందుకు అని నేను అడిగితే మీ కుటుంబానికి కాస్త హాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పారు. రాజకీయాల్లోకి మా కుటుంబం వస్తే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని, మేం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పించేందుకు మా ఇంటి ఆడబిడ్డల మీద విపరీతమైన దుష్ర్పచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డది. తమకు హానీ చేస్తారని తెలిస్తే, కడుపులోని బిడ్డను కూడా చంపేందుకు వెనుకాడరు " అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జనసేన పార్టీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. తనకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది. కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలి అంటూ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే. కానీ తనను భయపెట్టే కొలది తాను మరింత రాటు దేలుతాను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి : Pawan Kalyan's Challenges To YSRCP: గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో ఒక్కటి కూడా వైసీపీకి దక్కొద్దు
జనసేన పార్టీ వేదికను బతికించుకుందాం
జనసేన పార్టీ విప్లవకారుల స్ఫూర్తిని నింపుకున్న నిజాయతీ గల వ్యక్తుల సమూహంతో నిండిన పార్టీ. పోరాటాల పార్టీ. ప్రజా సమస్యలపై ఎవరికీ భయపడకుండా ముందుకెళ్లే పార్టీ. అలాంటి వేదికను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 2019లో పార్టీ ఓడిపోయినా బలంగా ఎందుకు నిలబడ్డాను అంటే నన్ను నమ్మిన 7 శాతం ప్రజల కోసం... వారిని వదిలి వెళ్లకూడదనే బలమైన మాట కోసం ఉన్నాను. పార్టీ నాయకత్వం అధికారికంగా ఒకరికి బాధ్యత అప్పగిస్తే, వారి తీరు నచ్చకపోతే పార్టీకి అవసరమయ్యేలా మీరు మరో మార్గంలో పనిచేయండి. పార్టీ ఉన్నతి కోసం చేసే ఏ కార్యక్రమం అయినా మంచిదే. లేనిపోని అహం వల్ల పార్టీ నడవదు. క్రమశిక్షణ పార్టీకి బలం. దానిని ఎట్టి పరిస్థితుల్లో తప్పొద్దు. ఏకత్వ స్ఫూర్తితో ముందుకు వెళ్లండి. సమాజంలో మనుషుల్ని చదవండి. వారి నుంచి నేర్చుకోండి. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీర మహిళల మీద చేసిన దాడిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయేది లేదు. ఓ బలమైన కార్యాచరణ లేక అప్పట్లో వెనకడుగు వేశాం. కచ్చితంగా దీనికి సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది. ప్రజల ఉన్నతి కోసం పనిచేసే శక్తివంతమైన నాయకులుగా తయారు కండి.. చరిత్ర కచ్చితంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది " అని చెబుతూ పార్టీ శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ కొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి : Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?
ఇది కూడా చదవండి : Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK