Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర వ్యాప్తంగానే దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం గంగవరానికి చలువాది నాగ మల్లేశ్వరరావు గత సినిమాలకు కథలు రాస్తూ ఉన్నాడు. పదిహేను యేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తీన్మార్’ షూటింగ్ సమయంలో చలువాది నాగమల్లేశ్వరరావు మెగా ఫ్యామిలీ మీదున్న అభిమానంతో ఒక స్టోరీ రాసుకొని పవన్ కళ్యాణ్ కి చెప్పగా.. పవర్ స్టార్ కు ఆ కథ నచ్చింది. వెంటనే అతన్ని ముందుగా ఈ కథ రిజిస్ట్రేషన్ చేయించి తనను సంప్రదించవలసిందిగా కోరాడు.
ఆ తర్వాత కథ రిజిస్ట్రేషన్ చేయడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత 13 యేళ్లుగా పవన్ కళ్యాణ్ ను కలిసి తన సినిమా గురించి అడుగుదామని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి నా సందేశం చేరేలా ప్రయత్నిస్తున్నానని నాగమల్లేశ్వరరావు తెలిపారు. మరి అభిమాని సందేశాన్ని పనవ్ కళ్యాణ్ పట్టించుకుంటాడా లేదా అనేది చూడాలి.
ప్రస్తుతం ఒకప్పటిలా సినిమా హీరోగానే కాకుండా.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూనే.. రాష్ట్ర, దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాల్సిన పని కూడా పవన్ కళ్యాణ్ పై ఉంది. మరి ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ .. అభిమాని ఆవేదనను అర్ధం చేసుకొని ఆయన చెప్పే కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. రీసెంట్ గా జరిగిన 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ .. టీడీపీ, బీజేపీ కూటమితో జతకట్టి ఎన్నికల బరిలో దిగారు. అంతేకాదు పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సంచలనం రేపారు. అంతేకాదు 100 శాతం స్ట్రైక్ రేట్ తో వార్తల్లో నిలిచారు.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి