ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి . . ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు రాజధాని అమరావతికే దిక్కూ దివాణం లేదన్నారు. అమరావతిలో పరిపాలన పూర్తిగా కుదురుకోకముందే .. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ .. వారిని విశాఖ పట్నం పంపిస్తారా అని ప్రశ్నించారు. రాజధాని మార్పు అంటే ఆఫీసును ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదు .. వేల మంది జీవితాలను బలవంతంగా తరలించడమేనని ట్వీట్ చేశారు. ఇందుకోసం వారికయ్యే వ్యయ ప్రయాసలను ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ ప్రజలకు అశాంతి, అభద్రత , అనిశ్చితి తప్ప .. ఏం ఒరగలేదన్నారు.
జగన్ రెడ్డి గారు ,అసెంబ్లీలో ప్రకటన ఒక
ఒక వ్యూహం ప్రకారమే చేసారు... pic.twitter.com/J4Rx3wrW0C— Pawan Kalyan (@PawanKalyan) December 17, 2019
నిపుణుల కమిటీ నుంచి నివేదిక రాకముందే జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టారు. ఇది కమిటీ సభ్యులను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. నిర్ణయం తీసుకున్న తర్వాత .. కమిటీ వేయడం ఎందుకని పవన్ ప్రశ్నించారు. . .