శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. జిల్లా వాసులు అన్నివిధాల వెనుకబాటుకు గురై ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని, జిల్లాలో ఏ మూలకు వెళ్ళినా అభివృద్ధి లేక సమస్యలే విలయతాండవం చేస్తున్నాయని అన్నారు. తాము కాలి నడకన తిరిగి పరిస్థితులను అంచనా వేశామని చెబుతూ.. జగన్‌లా తాము తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేయమని పవన్‌కల్యాణ్ ఆరోపించారు. జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి రానివ్వడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి స్పందిస్తూ ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.