విశాఖలో రోడ్డు ప్రమాదం...నేవీ ఉద్యోగి మృతి

డివైడర్​ను ఓ బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇండియన్ నేవీ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 04:01 PM IST
విశాఖలో రోడ్డు ప్రమాదం...నేవీ ఉద్యోగి మృతి

Road Accident: రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి దుర్మరణం(Navy employee died in accident)చెందాడు. ఈ ఘటన విశాఖ(Visakhapatnam)లో చోటుచేసుకుంది. మృతుడు ఇండియన్ నేవీలో పనిచేస్తున్న అనిల్ కుమార్(33)గా గుర్తించారు. అనిల్​కుమార్​ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సిరిపురం నుంచి రైల్వే స్టేషన్​ వైపు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్(telugu talli flyover)​పై డివైడర్​ను ఢీకొట్టి పక్కన పడిపోయాడు.

Also Read: మరో 10 రోజుల్లో ఆ మహిళా కానిస్టేబుల్ వివాహం... ఇంతలోనే కబళించిన మృత్యువు...

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని రాంనగర్ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో అతడు హెల్మెట్(helmet) ధరించి ఉన్నప్పటికీ ప్రాణాలు దక్కలేదు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ నేవీ అధికారులకు సమాచారం అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News